English | Telugu
హిందీ మర్యాద రామన్నలో తమన్నా
Updated : Jul 12, 2011
హిందీ "మర్యాదరామన్న" లో తమన్నా హీరోయిన్ గా నటించనుందని విశ్వసనీయ వర్గాల ద్వారా అందిన సమాచారం. వివరల్లోకి వెళితే హాస్యనటుడు సునీల్ హీరోగా, సలోనీ హీరోయిన్ గా, యస్.యస్.రాజమౌళి దర్శకత్వంలో, నిర్మించిన సూపర్ హిట్ మూవీ "మర్యాదరామన్న". ఈ చిత్రాన్ని బాలీవుడ్ లో అంటే హిందీలో రీమేక్ చేస్తున్నారట. అజయ్ దేవగణ్ ఈ "మర్యాదరామన్న" హిందీ రీమేక్ లో హీరోగా నటించనున్నారట. హిందీలో గతంలో "అతిథి తుమ్ గబ్ జావోగీ" అనే సినిమాకి దర్శకత్వం వహించిన అశ్వనీ ధీర్ ఈ "మర్యాదరామన్న" హిందీ రీమేక్ చిత్రానికి దర్శకత్వం వహిస్తారట.
ఈ "మర్యాదరామన్న" హిందీ రీమేక్ చిత్రాన్ని సునిలీన్ తల్రేజ నిర్మిస్తారట. ఈ "మర్యాదరామన్న" హిందీ రీమేక్ చిత్రంలో మిల్కీ వైట్ బ్యూటీ తమన్నా భాటియా హీరోయిన్ గా నటించనుందని విశ్వసనీయ వర్గాల ద్వారా అందిన సమాచారం. తమన్నా గ్లామర్ కి ముచ్చటపడ్డ హీరో అజయ్ దేవ్ గణ్ ఆమెనే తన ఈ "మర్యాదరామన్న" హిందీ రీమేక్ చిత్రంలో హీరోయిన్ గా కావాలని అంటున్నాడట. తమన్నా ఇప్పుడు తెలుగులో రామ్ చరణ్ హీరోగా "రచ్చ", యన్ టి ఆర్ హీరోగా "ఊసరవెల్లి", రామ్ హీరోగా ఒక సినిమాతో యమ బిజీగా ఉంది.