English | Telugu
వెంకటేష్ హీరోగా బోయపాటి చిత్రం
Updated : Jul 8, 2011
వెంకటేష్ హీరోగా బోయపాటి చిత్రం విశ్వసనీయవర్గాల ద్వారా అందిన సమాచారం. వివరాల్లోకి వెళితే గతంలో విక్టరీ వెంకటేష్ హీరోగా, నయనతార హీరోయిన్ గా, బోయపాటి శీను దర్శకత్వంలో వచ్చిన "తులసి" సూపర్ హిట్టయ్యింది. ఆ తర్వాత వెంకటేష్ హీరోగా బోయపాటి శీను దర్శకత్వంలో మరో సినిమా ఇంతవరకూ రాలేదు. కానీ ఈ మధ్య దర్శకుడు బోయపాటి హీరో వెంకటేష్ కి ఒక చక్కని కథను చెప్పారట. ఆకథ వెంకటేష్ కి నచ్చిందట. దాంతో ఆ లైన్ ని డెవలప్ చేయమని వెంకటేష్ అతనితో అన్నారట.
ఆ కథని ప్రేక్షక జనరంజకంగా తయారుచేసే పనిలో ఉన్నారట బోయపాటి శీను. ఈ సినిమా బహుశా ఆగస్టు నెల చివర్లో ప్రారంభం కావచ్చని తెలిసింది. బోయపాటి శీను ప్రస్తుతం యన్ టి ఆర్ హీరోగా, శృతి హాసన్ హీరోయిన్ గా, క్రియెటీవ్ కమర్షియల్స్ పతాకంపై, కె.యస్.రామారావు నిర్మిస్తున్న చిత్రానికి దర్శకత్వం వహిస్తున్నారు.