English | Telugu

ప్రభాస్ హీరోగా రాజమౌళి సినిమా ఏమైంది...?

ప్రభాస్ హీరోగా రాజమౌళి సినిమా ఏమైంది...? అంటే ప్రస్తుతానికి ఆగిందనే చెప్పాలి. వివరాల్లోకి వెళితే దర్శకేంద్రుడు కె.రాఘవేంద్ర రావు, ఆయన కొడుకు, ఆయన అల్లుడు తదితరులంతా కలసి యంగ్ రెబెల్ స్టార్ ప్రభాస్ హీరోగా, ఇంతవరకూ అపజయమెరుగని యువ డైనమిక్ డైరెక్టర్ యస్.యస్.రాజమౌళి దర్శకత్వంలో ఒక భారీ చిత్రాన్ని తీయటానికి సన్నాహాలు చేసి ఈ సినిమా గురించి ప్రెస్ మీట్ పెట్టి మరి ప్రకటించారు. కానీ ప్రస్తుత పరిస్థితులు చూస్తుంటే ఆ సినిమా ఆగినట్టే కనిపిస్తోంది.

కారణం దర్శకుడు ఆ సినిమాకి అలవికాని స్థాయిలో భారీ బడ్జెట్ అడిగినట్లు ఫిలిం నగర్ వర్గాలంటున్నాయి. మన తెలుగు సినీ పరిశ్రమకు వర్కవుట్ కాదని నిర్మాతల ఆలోచనట. అంతేకాక రాజమౌళికి జూనియర్ యన్ టి ఆర్ తో "దానవీరశూర కర్ణ" సినిమాని రిమేక్ చేయాలని మహా ఉబలాటంగా ఉందట. అందుకు యన్ టి ఆర్ కూడా తన మామ నార్నే శ్రీనివాస్ ని ఈ సినిమాని భారీ బడ్జెట్ తో నిర్మించమని శతపోరుతున్నాడట. అదండీ విషయం.