English | Telugu

డేటింగ్‌ పూర్తయింది... ఇక పెళ్లికి రెడీ అంటున్న మిల్కీ బ్యూటీ!

కొంత కాలం క్రితం సౌత్‌లో నెంబర్‌ వన్‌ హీరోయిన్‌గా వెలుగొందిన తమన్నా ఇప్పుడు సినిమాల్లో అడపా దడపా కనిపిస్తోంది. అప్పుడున్నంత స్పీడ్‌లో తమన్నా ఇప్పుడు లేదు. అందుకే ఇక పెళ్లి చేసుకోవాలనుకుంటోందట. నిన్న మొన్నటి వరకు నటుడు విజయ్‌వర్మతో డేటింగ్‌లో ఉన్న తమన్నా ఇక పెళ్లి చేసుకునేందుకు డిసైడ్‌ అయ్యిందనే వార్తలు వస్తున్నాయి. డేటింగ్‌కు ఫుల్‌స్టాప్‌ పెట్టి పెళ్లి పీటలు ఎక్కబోతున్నారట. తమన్నా ఫ్యామిలీ ఆమె పెళ్లి గురించి ఎక్కువ టెన్షన్‌ అవుతుండడంతో ఈ జంట త్వరలోనే ఓ ఇంటివారు కావాలని ఆశపడుతున్నారు. వచ్చే ఏడాదిలో వీరిద్దరూ పెళ్లి చేసుకోనున్నారని సమాచారం. ఇవన్నీ రూమర్సే అయినా దీపావళి పండుగను ఇద్దరూ కలిసి జరుపుకోవటంతో పెళ్లి చేసుకోవడం ఖాయమని అర్థమైంది. 

తమన్నా ప్రస్తుతం ‘అరన్‌ మణి 4’ అనే తమిళ సినిమాలోనూ, వేద అనే హిందీ సినిమాలోనూ నటిస్తున్నారు. ఈ రెండు సినిమాలు శరావేగంగా షూటింగ్‌ జరుపుకుంటున్నాయి. తమన్నా ఓ వైపు సినిమాలు చేస్తూనే మరో వెబ్‌ సిరీస్‌పై కూడా దృష్టిపెట్టారు. ఈ నేపథ్యంలోనే లస్ట్‌ స్టోరీస్‌2తో పాటు పలు ఓటీటీ కంటెంట్‌కు ఓకే చేశారు.