English | Telugu

కొత్త ఇంటికోసం రూ.200 కోట్లు ఖర్చు పెదుతున్న ప్రభాస్‌?

ఇండియన్‌ ఫిలిం ఇండస్ట్రీలో ప్రభాస్‌కి వున్న క్రేజ్‌ తెలిసిందే. ‘బాహుబలి’తో తన రేంజ్‌ పెంచుకున్న ప్రభాస్‌ ఆ సినిమా తర్వాత చేసే సినిమాలన్నీ పాన్‌ ఇండియా మూవీసే కావడం విశేషం. సాహో, రాధేశ్యామ్‌, ఆదిపురుష్‌ వంటి సినిమాలు ఆశించిన విజయం సాధించకపోయినా కలెక్షన్లపరంగా ఎక్కడో ఒక చోట సంచలనం సృష్టిస్తూనే ఉంటాయి. 

తాజాగా ‘సలార్‌’ కోసమే అందరూ ఎదురుచూస్తున్నారు. షూటింగ్‌ ఎప్పుడో పూర్తి చేసుకున్న ఈ సినిమా రిలీజ్‌ విషయానికి వచ్చేసరికి వాయిదాలు పడుతూ వస్తోంది. డిసెంబర్‌ 22న ప్రపంచవ్యాప్తంగా ‘సలార్‌’ విడుదల కాబోతోంది. ఇదిలా ఉంటే ప్రభాస్‌కు సంబంధించిన ఓ న్యూస్‌ సోషల్‌ మీడియాలో వైరల్‌ అవుతోంది. అదేమిటంటే.. హైదరాబాద్‌లో ప్రభాస్‌ ఓ లగ్జరీ ఇల్లు కట్టించబోతున్నారు. ఇంటి నిర్మాణం కోసం నగరానికి కొంచెం దూరంలో రెండు ఎకరాల స్థలాన్ని కొనుగోలు చేశారని తెలుస్తోంది. 

ఈ స్థలం విలువే 120 కోట్ల రూపాయలు అని సమాచారం. ఇంటి నిర్మాణం పనులు ప్రారంభించారని తెలుస్తోంది. నిర్మాణానికి 80 కోట్ల రూపాయలు ఖర్చు చేయబోతున్నారట. అంటే ఈ ఇంటి కోసం 200 కోట్ల రూపాయలు ఖర్చు చేస్తున్నారన్నమాట. ఎంతో లగ్జరీగా, మరెంతో మోడర్న్‌గా ఈ ఇల్లు ఉండబోతోందట. ఇది ఇండస్ట్రీలో వినిపిస్తున్న మాట. ఇప్పటికే చాలా మంది టాప్‌ హీరోలకు ఇంద్రభవనాల్లాంటి ఇళ్ళు ఉన్నాయి. ఇప్పుడు ప్రభాస్‌ కొత్త ఇంటిని నిర్మిస్తున్న విషయం నిజమే అయితే వారి సరసన ప్రభాస్‌ కూడా చేరతాడు. ప్రభాస్‌కి మన దేశంలోనే కాదు, ఇటలీఓ కూడా ఒక విలాసవంతమైన భవనం ఉందట. దాన్ని వెకేషన్‌ కోసం వాడుతూ ఉంటారట.