English | Telugu

3 నిమిషాలకు 3 లక్షలు వసూలు చేసిన తమన్నా

3 నిమిషాలకు 3 లక్షలు వసూలు చేసిన తమన్నా అనగానే అపార్థం చేసుకోకండి. విషయమేమిటంటే ప్రముఖ హీరోయిన్ తమన్నా ఈ మధ్య తాను హీరోయిన్ గా, నాగచైతన్య హీరోగా, సుకుమార్ దర్శకత్వంలో నటించిన "100% లవ్" అనే సినిమా ఆడియో ఫంక్షన్ లో ఒక పాటకు డ్యాన్స్ చేసినందుకు అక్షరాలా మూడు లక్షల రూపాయలు వసూలు చేసిందట. అంటే ఒక నిమిషానికి ఒక లక్ష రూపాయలన్నమాట.


  "ఈ సినిమాలో హీరోయిన్ నువ్వే కదా. మరి నీ సినిమా ఆడియోని ప్రమోట్ చేయాల్సిన బాధ్యత నీకు లేదా...? అందుకు నీకు మూడు లక్షలు ఎందుకివ్వాలి...?" అని అడిగితే... అందుకు సమాధానంగా " ఈ సినిమాలో నటించటానికి మాత్రమే పారితోషికం తిసుకున్నాను కానీ ఈ చిత్రాన్ని ప్రమోట్ చేయటం కోసం మాత్రం కాదు. అందుకే అలా ఛార్జ్ చేశా"నందట తమన్నా. "100% లవ్" సినిమాకి దేవీశ్రీ ప్రసాద్ సంగీతాన్నందించారు. ఈ "100% లవ్" చిత్రంలో కలర్స్ స్వాతి ఒక పాట పాడటం విశేషం.