English | Telugu

రామ్ చరణ్ హీరోగా గణేష్ సినిమా

రామ్ చరణ్ హీరోగా, గణేష్ సినిమా నిర్మించబోతున్నాడట. వివరాల్లోకి వెళితే రామ్ చరణ్ హీరోగా, వి.వి.వినాయక్ దర్శకత్వంలో, గణేష్ ఒక సినిమా నిర్మించబోతున్నారని ఫిలిం నగర్ వర్గాల ద్వారా అందిన సమాచారం. ఒక చిన్న నటుడిగా తన సినీ జీవితాన్ని మొదలుపెట్టి హాస్యనటుడిగా ఎదిగి, ఆ తర్వాత ప్రస్తుతం పరమేశ్వర ఆర్ట్స్ పతాకంపై "ఆంజనేయులు", "తీన్ మార్" సినిమాలను నిర్మించారు గణేష్. యువ హీరో రామ్ చరణ్ కోసం దర్శకుడు వి.వి.వినాయక్ ఒక కథను తయారుచేశారట.

ఆ కథ విన్న వెంటనే రామ్ చరణ్ ఆ సినిమాలో నటించటానికి అంగీకరించారని తెలిసింది. ఇది యాక్షన్ బేస్డ్ లవ్ స్టోరీ అనీ, పక్కా మాస్ ఎంటర్ టైనర్ గా ఈ చిత్రాన్ని రూపొందిస్తారని సమాచారం. వినాయక్ డైనమిక్ డైరెక్షన్ లో, రామ్ చరణ్ ఎనర్జిటిక్ యాక్షన్ తో ఉండే ఈ చిత్రాన్ని భారీ బడ్జెట్ తో నిర్మిస్తానని గణేష్ అంటున్నారట. ఈ సినిమాకి సంబంధించిన మిగిలిన వివరాలు త్వరలో అందిస్తాం.