English | Telugu
సురేందర్‌రెడ్డి తో చెర్రీ కొత్త సినిమా?
Updated : Jan 3, 2015
టాలీవుడ్ టాప్ డైరెక్టర్లలో సురేందర్‌రెడ్డి ఒకడు. గత కొంతకాలంగా బాక్స్ ఆఫీస్ వద్ద సరైన హిట్ లేని సురేందర్‌రెడ్డి, అల్లు అర్జున్ తో తీసిన ‘రేసు గుర్రం’ బ్లాక్ బస్టర్ తో ఒక్కసారిగా స్టార్ డిరెక్టర్ల రేసులోకి దూసుకొని వచ్చాడు. బన్నీతో హిట్ కొట్టిన సురేందర్‌రెడ్డి కి మెగా కాంపౌండ్ నుంచి మరో ఆఫర్ వచ్చినట్లు సమాచారం. సురేందర్‌రెడ్డి చెప్పిన కథనచ్చి ఆయనకు చెర్రీ ఓకే చెప్పినట్లు తెలుస్తోంది. ప్రస్తుతం కిక్-2 సినిమాతో బిజీగా ఉన్న సురేందర్ రెడ్డి, ఆ సినిమా తరువాత రాంచరణ్ తో సినిమా చేస్తాడట.‘రేసు గుర్రం’ తో హిట్ మంచి స్పీడ్ మీద ఉన్న 'సూరి' ఎలాగైనా తనకు హిట్ ఇస్తాడనే ఆలోచనతో ఉన్నాడట చెర్రీ.