English | Telugu
ఆ ఇద్దరితో శ్రుతిహాసన్....!
Updated : Jan 3, 2015
అక్కినేని నాగార్జున, తమిళ హీరో కార్తీ కాంబినేషన్ లో ఓ మల్టీస్టారర్ మూవీ తెరకెక్కుతున్న విషయం ఇదివరకే తెలిసిందే! వంశీపైడిపల్లి దర్శకత్వం వహించనున్న ఈ సినిమాను పివిపి సంస్థ నిర్మించనుంది. ఇప్పటికే చాలా ఆలస్యం కావడంతో ఈ సినిమాను త్వరలోనే సెట్స్ పైకి తీసుకెళ్లాలనే ప్లాన్ లో వున్నారు చిత్ర యూనిట్. లేటెస్ట్ గా ఈ సినిమాలో హీరోయిన్ గా శృతిహాసన్ ను తీసుకున్నారు. ఈ సినిమాలో హీరోయిన్ కోసం ఎంతోమందిని అనుకున్నప్పటికీ... చివరకు శృతి హాసన్ నే ఎంపిక చేసారు. ఈ విషయాన్నీ స్వయంగా శృతియే సోషల్ మీడియా ద్వారా చెప్పుకొచ్చింది. “After an awesome experience with Yevadu, really excited to be a part of Vamshi Paidipally’s next film starring Akkineni Nagarjuna and Karthi. A unique and heartwarming story that I am so glad to be a part of” అంటూ ట్విట్టర్ లో ట్వీట్ చేసింది. ఈ మల్టీస్టారర్ సినిమాపై ఇండస్ట్రీలో మంచి అంచనాలే వున్నాయి.