English | Telugu

టాలీవుడ్ హీరోయిన్ పై అత్యాచారయత్నం!

టాలీవుడ్ ఇండస్ట్రీ ప్రముఖ హీరోయిన్ పై కోల్‌కతాలో అత్యాచారయత్నం జరిగినట్లు మీడియాలో వార్తలు వస్తున్నాయి. ఆమె ఇంట్లోకి వెళ్ళబోతూ వుండగా ఒక వ్యక్తి వచ్చి తనను పట్టుకుని లాగబోయాడని, గట్టిగా అరవడంతో తన సెల్‌ఫోన్‌ని లాక్కుని పారిపోయాడని ఆ హీరోయిన్ పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేసినట్టు సమాచారం. పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు. అయితే ఆమెను మాత్రం బయటకు వెల్లడించేందుకు పోలీసులు నిరాకరిస్తున్నారు. అయితే కోల్‌కతాలో నివాసం ఉండే తెలుగు ప్రముఖ హీరోయిన్ ఎవరో మీరే నిర్ణయించుకోవాలన్నమాట. ఇంతకీ ఆ వ్యక్తి దొంగతన౦ చేయడానికి వచ్చాడా లేక అత్యాచారం చేయడానికి వచ్చాడా అనే దానిపై అనుమానాలు కలుగుతున్నాయి.