English | Telugu

బిగ్ సర్ప్రైజ్.. 'RC16'లో సూపర్ స్టార్!

తన 15వ సినిమా 'గేమ్ ఛేంజర్'(Game Changer)ని శంకర్ దర్శకత్వంలో చేస్తున్న మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ (Ram Charan).. 16వ సినిమాని 'ఉప్పెన' ఫేమ్ బుచ్చిబాబు డైరెక్షన్ లో చేయనున్న సంగతి తెలిసిందే. సుకుమార్ రైటింగ్స్ తో కలిసి వృద్ధి సినిమాస్ ఈ చిత్రాన్ని నిర్మించనుంది. ఇదొక స్పోర్ట్స్ డ్రామా అని, ఈ సినిమా కోసం చరణ్ ప్రత్యేకంగా మేకోవర్ కాబోతున్నట్లు తెలుస్తోంది. ఇదిలా ఉంటే ఈ సినిమాలో ఇప్పటికే తమిళ స్టార్ విజయ్ సేతుపతి (Vijay Sethupathi) కీలక పాత్ర పోషించనున్నట్లు తెలుస్తుండగా.. ఇప్పుడు కన్నడ సూపర్ స్టార్ శివ రాజ్‌కుమార్ (Shiva Rajkumar) కూడా రంగంలోకి దిగుతున్నట్లు సమాచారం.

'RC16'లో అత్యంత కీలకమైన ఓ పాత్ర కోసం శివ రాజ్‌కుమార్ కి తీసుకున్నట్లు వినికిడి. శివన్న సైతం ఈ సినిమాలో నటించడానికి వెంటనే అంగీకరించాడట. ఇతర భాషల చిత్రాలలో అతిథి పాత్రలు చేయడానికి కన్నడ సూపర్ స్టార్ ఎప్పుడూ ముందే ఉంటాడు. గతంలో 'గౌతమిపుత్ర శాతకర్ణి'లో గెస్ట్ అప్పీరెన్స్ ఇచ్చాడు. ఇక 'జైలర్'లో ఆయన పోషించిన అతిథి పాత్ర ఎంతటి ప్రభావం చూపించిందో ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు. 'RC16'లో శివ రాజ్‌కుమార్ కనిపించబోయే ప్రత్యేక అంతకుమించి పవర్ ఫుల్ గా ఉండబోతుందట.