English | Telugu

కోలీవుడ్ స్టార్ డైరెక్టర్ తో ప్రభాస్ మూవీ!

ఇటీవల 'సలార్'తో ప్రేక్షకులను పలకరించిన పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ చేతిలో 'కల్కి 2898 AD', మారుతి ప్రాజెక్ట్, 'స్పిరిట్', 'సలార్-2' వంటి సినిమాలు ఉన్నాయి. అలాగే హను రాఘవపూడి దర్శకత్వంలో కూడా ఒక సినిమా చేయనున్నాడు. ఇదిలా ఉంటే ఇప్పుడు తమిళ దర్శకుడు కార్తీక్ సుబ్బరాజ్ తో సైతం ఒక సినిమా చేసే అవకాశముందని తెలుస్తోంది.

'పిజ్జా', 'జిగర్తాండ', 'పేట', 'మహాన్' వంటి సినిమాలతో తమిళనాట దర్శకుడిగా మంచి గుర్తింపు తెచ్చుకున్నాడు కార్తీక్ సుబ్బరాజ్. అయితే ఇప్పుడు ఆయన చూపు తెలుగు మీద పడిందట. ఈమధ్య పలువురు తమిళ దర్శకులు తెలుగు హీరోలతో సినిమాలు చేయడానికి ఇంట్రెస్ట్ చూపిస్తున్నారు. ఇప్పుడదే బాటలో కార్తీక్ సుబ్బరాజ్ పయనిస్తున్నట్లు సమాచారం. ఇటీవల ఆయన నేచురల్ స్టార్ నానితో సినిమా చేసే అవకాశముందని ప్రచారం జరిగింది. మరి ఆ ప్రాజెక్ట్ పట్టాలెక్కుతుందో లేదో తెలీదు కానీ.. ఇప్పుడు కార్తీక్ సుబ్బరాజ్ చూపు ఏకంగా ప్రభాస్ వైపు మళ్లినట్లు టాక్. ఇప్పటికే ఈ కోలీవుడ్ డైరెక్టర్.. ప్రభాస్ ని కలిసి స్టోరీ లైన్ కూడా వినిపించాడట. అది విని ప్రభాస్ ఇంప్రెస్ అయ్యాడట. కానీ రెబల్ స్టార్ కి ఉన్న ఇతర కమిట్ మెంట్స్ వల్ల.. ఈ ప్రాజెక్ట్ పట్టాలెక్కాలంటే చాలా సమయం పట్టే అవకాశముంది. మరి ఈలోపు కార్తీక్ సుబ్బరాజ్ మరో ప్రాజెక్ట్ ని పూర్తి చేస్తాడేమో చూడాలి.