English | Telugu
మళ్ళీ దొరికిపోయిన గురూజీ.. 'గుంటూరు కారం' ఆ నవలకు కాపీ!
Updated : Jan 5, 2024
'అతడు', 'ఖలేజా' తర్వాత సూపర్ స్టార్ మహేష్ బాబు, మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ శ్రీనివాస్ కాంబినేషన్ లో వస్తున్న మూవీ 'గుంటూరు కారం'. హారిక & హాసిని క్రియేషన్స్ నిర్మిస్తున్న ఈ సినిమా సంక్రాంతి కానుకగా జనవరి 12న ప్రేక్షకుల ముందుకు రానుంది. ఈ చిత్రంపై భారీ అంచనాలు ఉన్నాయి. అయితే విడుదల తేదీ దగ్గర పడుతున్న సమయంలో ఈ సినిమాకి సంబంధించి ఓ షాకింగ్ న్యూస్ వినిపిస్తోంది. 'గుంటూరు కారం' ఓ నవలకు కాపీ అని ప్రచారం జరుగుతోంది.
ప్రముఖ రచయిత్రి యద్దనపూడి సులోచనారాణి రాసిన పలు నవలలు సినిమాలుగా తీయబడ్డాయి. ముఖ్యంగా 'మీనా' రెండు సార్లు సినిమాగా తీయబడింది. 'మీనా' నవలను అదే పేరుతో విజయనిర్మల సినిమాగా తెరకెక్కించగా, దానిని ఆధారంగా చేసుకొని త్రివిక్రమ్ 'అఆ' రూపొందించాడు. 'అఆ' విడుదల సమయంలో దీనిపై వివాదం కూడా చెలరేగింది. 'మీనా' నవలను ఆధారంగా చేసుకునే 'అఆ' తెరకెక్కించినట్లు అప్పుడు చిత్ర బృందం అధికారికంగా ప్రకటించింది. ఇక ఇప్పుడు 'గుంటూరు కారం' కోసం కూడా యద్దనపూడి సులోచనారాణి నవలనే త్రివిక్రమ్ నమ్ముకున్నట్లు ఇన్ సైడ్ టాక్. ఆమె రాసిన 'కీర్తికిరీటాలు' అనే నవలను ఆధారంగా చేసుకొని 'గుంటూరు కారం' కథను రాసుకున్నట్లు న్యూస్ చక్కర్లు కొడుతోంది. మరి ఈ ప్రచారంలో వాస్తవమెంతో తెలియాలంటే జనవరి 12 వరకు వేచి చూడాలి.