English | Telugu

సునీల్ "పూలరంగడు"లో "కొలవరిడి" కి పేరడి

సునీల్ "పూలరంగడు"లో "కొలవరిడి" కి పేరడి ఉందని ఫిలిం నగర్ వర్గాలంటున్నాయి. వివరాల్లోకి వెళితే ధనుష్ పాడిన "వై దిస్ కొలవరి కొలవరి కొలవరిడి" అనే పాటలాగా సునీల్ హీరోగా నటిస్తున్న "పూలరంగడు" చిత్రంలో దానికి ఒక పేరడీ సాంగ్ ఉన్నట్లు విశ్వసనీయవర్గాల ద్వారా అందిన సమాచారం. ఆర్ ఆర్ మూవీ మేకర్స్ పతాకంపై, సునీల్ హీరోగా, "ప్రేమకావాలి" ఫేం ఇషా చావ్లా హీరోయిన్ గా, "అహ నా పెళ్ళంట" ఫేం వీరభద్ర చౌదరి దర్శకత్వంలో, డాక్టర్ వెంకట్ నిర్మిస్తున్న చిత్రం "పూలరంగడు".

ఈ చిత్రంలో హీరో సునీల్ ఎవరూ ఊహించని విధంగా సిక్స్ ప్యాక్ బాడీని సాధించాడు. హిందీ హీరోలు సల్మాన్ ఖాన్, అమీర్ ఖాన్, షారూఖ్ ఖాన్ లతో పాటు మన హీరోలు అల్లు అర్జున్, రామ్ చరణ్, సూర్య వంటి వారంతా ఈ సిక్స్ ప్యాక్ సాధించిన వారిలో ఉన్నారు. సునీల్ వాళ్ళకన్నా ఒక మెట్టు పైనే ఉన్నాడనిపించేలా అతని బాడీ ఉంది. అలాగే "పూల రంగడు" చిత్రంలో అతని మీద ధనుష్ పాడిన "వై దిస్ కొలవరి కొలవరి కొలవరిడి" అనే పాటలాంటి ఒక పేరడీ పాట కూడా ఉందట.