English | Telugu
రామ్ చరణ్ "ఎవడు...?" కథేంటి...!
Updated : Dec 30, 2011
రామ్ చరణ్ "ఎవడు...?" కథేంటి...! అంటే శ్రీ వెంకటేశ్వర క్రియేషన్స్ పతాకంపై, మెగాపవర్ స్టార్ రామ్ చరణ్ హీరోగా, స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ అతిథి పాత్రలో నటిస్తూండగా, వంశీ పైడిపల్లి దర్శకత్వంలో, దిల్ రాజు నిర్మిస్తున్న చిత్రం"ఎవడు...?". I "ఎవడు...?" ఈ "ఎవడు...?" చిత్రం కథ విషయానికొస్తే రామ్ చరణ్, అల్లు అర్జున్ ఇద్దరూ పోలీస్ ఆఫీసర్లుగా నటిస్తున్నారట.
సినిమా అరగంట అయిన తర్వాత ఒక యాక్షన్ సీన్లో రామ్ చరణ్ తలకి పెద్దగాయమై, అల్లు అర్జున్ చనిపోతాడట. అప్పుడు అల్లు అర్జున్ మెదడుని రామ్ చరణ్ కి అమర్చుతారట. అప్పుడు రామ్ చరణ్ విలన్ల ఆట కట్టిస్తాడట. ఇదే "ఎవడు...?" చిత్రం కథగా ఫిలిం నగర్ లో బహుళ ప్రచారంలో ఉంది. మరి ఇందులో నిజమెంతో...అబద్ధమెంతో కాలమే చెప్పాలి.