English | Telugu

ప్రిన్స్, విష్ణు కాంబోలో చిత్రం

ప్రిన్స్, విష్ణు కాంబోలో చిత్రం రానుందని విశ్వసనీయవర్గాల ద్వారా అందిన సమాచారం. వివరాల్లోకి వెళితే ఇటీవల పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ హీరోగా నటించిన "పంజా" చిత్రానికి దర్శకత్వం వహించిన ప్రముఖ తమిళ దర్శకుడు విష్ణువర్థన్ దర్శకత్వంలో ప్రిన్స్ మహేష్ బాబు, మంచు విష్ణువర్థన్ హీరోలుగా ఒక సినిమా రూపుదిద్దుకోనుందని ఫిలిం నగర్ వర్గాలంటున్నాయి. ఇక్కడ ప్రత్యేకమైన విషయం ఏమిటంటే ప్రిన్స్ మహేష్ బాబు, దర్శకుడు విష్ణువర్థన్ చెన్నైలో క్లాస్ మేట్స్ అని తెలిసింది. ఆ చనువుకొద్దీ స్నేహితుడి దర్శకత్వంలోని సినిమాలో హీరోగా నటించేందుకు ఆ సినిమాకు మహేష్ బాబు తన డేట్లను కూడా సర్దుబాటయ్యేలా చూస్తున్నాడట. అలాగే కవలపిల్లలు పుట్టిన వేళా విశేషమేమోగానీ ప్రిన్స్ తో పాటు నటించే అవకాశం మంచు విష్ణువర్థన్ కి కూడా లభించినట్లేనంటున్నారు ఫిలిం నగర్ వాసులు. మరి వీరిద్దరి కాంబోలో వచ్చే ఈ చిత్రం ప్రేక్షకులను ఎంతగా ఆకట్టుకుంటుందో కాలమే చెప్పాలి.