English | Telugu
బెల్లంకొండ "బాడీగార్డ్"గా సునీల్
Updated : Mar 4, 2011
బెల్లంకొండ సురేష్ నిర్మించే "బాడీ గార్డ్" చిత్రంలో హీరో సునీల్ హీరోగా నటించటానికి అంగీకరించాడని సమాచారం. నిజానికి ఈ "బాడీగార్డ్" చిత్రంలో వెంకటేష్ హీరోగా నటించాల్సి ఉంది. మళయాళంలో సూపర్ హిట్టయిన ఈ "బాడీగార్డ్" చిత్రం తమిళంలో ఆశించిన స్థాయిలో హిట్టవలేదు. అందుకని నిర్మాత సురేష్ బాబు తన సోదరుడు వెంకటేష్ ఈ చిత్రంలో నటించటానికి అంగీకరించలేదని సమాచారం. దాని కారణంగా సునీల్ ని ఈ "బాడీగార్డ్" చిత్రంలో హీరోగా నటింపజేయటానికి నిర్మాత బెల్లంకొండ సురేష్ ప్రయత్నిస్తున్నారు.
ప్రస్తుతం సునీల్ దిల్ రాజు నిర్మించబోయే "నెపోలియన్"చిత్రంలో నటించటానికి అంగీకరించారు. దీంతో పాటు ఈ "బాడీగార్డ్"చిత్రంలో కూడా సునీల్ నటిస్తారని తెలిసింది.ఈ "బాడీగార్డ్" చిత్రాన్ని తెలుగులో సునీల్ హీరోగా నటిస్తూండగా, హిందీలో సల్మాన్ ఖాన్ హీరోగా నటిస్తున్నారు. తెలుగులో ఈ "బాడీగార్డ్" చిత్రం మంచి హిట్టవుతుందని నిర్మాత బెల్లంకోండ సురేష్ తో పాటు ప్రముఖ సినీ పండితులు కూడా అంచనా వేస్తున్నారు.