English | Telugu
వర్మ చిత్రంలో కలెక్షన్ కింగ్...?
Updated : Mar 1, 2011
వివాదాలకు కేంద్రబిందువుగా ఉండే ప్రముఖ దర్శక, నిర్మాత రామ్ గోపాల వర్మ త్వరలో తీయబోతున్న "బెజవాడ రౌడీలు" చిత్రంలో కలెక్షన్ కింగ్ మోహన్ బాబు నటించనున్నారని సమాచారం.ఈ చిత్రంలో నాగచైతన్య హీరోగా నటించటానికి అంగీకరించాడు.మోహన్ బాబు ఈ చిత్రంలో విజయవాడలోని ఒక వర్గానికి చెందిన రౌడీగా నటిస్తున్నారని ఫిలిం నగర్ వర్గాల భోగట్టా.
ప్రస్తుతం "దొంగల ముఠా" అనే చిత్రంతో బిజిగా ఉన్నారు.ఈ చిత్రం పూర్తి కాగానే ఈ "బెజవాడ రౌడీలు" అనే చిత్రాన్ని ప్రారంభిస్తారట.ఈ చిత్రం పేరుని మార్చాలని ఇప్పటికే విజయవాడ వాసులు వర్మ మీద ధ్వజమెత్తిన సంగతి ప్రేక్షకులకు తెలిసిందే.తాను తీయబోయే చిత్రం పబ్లిసిటీని వివాదాలతో ప్రారంభించటం వర్మ స్ట్రేటజీగా కనిపిస్తుంది."రక్తచరిత్ర"కానీ, "అప్పల్రాజు" కానీ "పెళ్ళి" కానీ ఇప్పుడీ "బెజవాడ రౌడీలు" చిత్రం కానీ వివాదాలతో నిండి ఉండటం బహుశా వర్మ ప్రత్యేకతేమో.