English | Telugu

రాఖీకి గంటకి రెండు లక్షలు

రాఖీకి గంటకి రెండు లక్షలు అంటే సీనియర్ నటి రాఖీ కాదు. ఈ రాఖీ ఎవరంటే పేంటీ లేకుండా ఫంక్షన్ కొచ్చి సంచలనం సృష్టించిన రాఖీ సావంత్. అలాగే "రాఖీ కా స్వయం వర్" అనే సంచలన కార్యక్రమాన్ని నిర్వహించిన రాఖీ సావంత్. గంటకి రెండు లక్షలంటే అపార్థం చేసుకోకండి. అసలు విషయానికొస్తే ఏం చేసైనా వార్తల్లో ఉండాలనుకునే వ్యక్తులు కొందరుంటారు. అంటే మన రామ్ గోపాల వర్మలాగ.

ఆ కోవకు చెందిన మనిషే ఈ రాఖీ సావంత్ కూడా. రాఖీ సావంత్ ఒక ఫోన్ కంపెనీ పబ్లిసిటీ కోసం డిమాండ్ చేసిన మొత్తం గంటకి అక్షరాలా రెండు లక్షల రూపాయలట. ఈ పబ్లిసిటీలో కస్టమర్స్ తో రాఖీ మాట్లాడాల్సి ఉంటుంది. డిమాండ్ ఉంటేనే ఎవరైనా డబ్బులిచ్చేది. లేకుంటే మన ముఖం కూడా చూడరు. అందుకనే దీపం ఉండగానే ఇల్లు చక్కబెట్టుకునే పనిలో ఉంది రాఖీ సావంత్.