English | Telugu

సుకుమార్ దర్శకత్వంలో రణబీర్ కపూర్!

పుష్ప సినిమాతో సుకుమార్ పాన్ ఇండియా డైరెక్టర్ గా పేరు తెచ్చుకున్నాడు. ప్రస్తుతం ఆయన రూపొందుతోన్న పుష్ప-2 పై దేశవ్యాప్తంగా భారీ అంచనాలు నెలకొన్నాయి. ఈ మూవీ 2024, ఆగస్టు 15న ప్రేక్షకుల ముందుకు రానుంది. ఇదిలా ఉంటే పుష్ప-2 తర్వాత బాలీవుడ్ హీరో రణబీర్ కపూర్ తో సుక్కు సినిమా చేసే అవకాశముందని తెలుస్తోంది.

రణబీర్ కపూర్ కి నార్త్ తో పాటు సౌత్ లోనూ మంచి గుర్తింపు ఉంది. ముఖ్యంగా తెలుగు ప్రేక్షకులకు బాగా దగ్గరవుతున్నాడు. గతేడాది రణబీర్ నటించిన బ్రహ్మాస్త్ర చిత్రం తెలుగులో మంచి విజయం సాధించింది. అలాగే అతని రీసెంట్ మూవీ యానిమల్ తెలుగునాట మంచి వసూళ్లతో దూసుకుపోతోంది. దీంతో టాలీవుడ్ కి చెందిన పలు ప్రముఖ నిర్మాణ సంస్థల చూపు రణబీర్ పై పడిందట. ముఖ్యంగా ఓ నిర్మాత సంస్థ సుకుమార్, రణబీర్ కాంబినేషన్ ని సెట్ చేసే పనిలో ఉందట. అన్నీ అనుకున్నట్లు కుదిరి, ఈ కాంబో సెట్ అయితే మాత్రం బాక్సాఫీస్ దగ్గర రూ.1000 కోట్ల బొమ్మ అవుతుంది అనడంలో సందేహం లేదు.