English | Telugu
అదే జరిగితే... పవన్‌కళ్యాణ్ అభిమానులకు నిరాశ తప్పదు!
Updated : Dec 4, 2023
ఒకప్పుడు పవన్‌కళ్యాణ్ హీరోగా సినిమా స్టార్ట్ అయిందంటే తొందరలోనే థియేటర్స్‌లోకి వచ్చేస్తుందని అభిమానులు ఆశించేవారు. కానీ, ఇప్పుడా పరిస్థితి కనిపించడంలేదు. కొంతకాలంగా పవన్ రాజకీయాలకే పరిమితం కావడంతో ఇప్పట్లో అతన్నుంచి సినిమా వచ్చే అవకాశాలు కనిపించడం లేదు. రాజకీయాలు, సినిమాలు అంటూ రెండు పడవలపై ప్రయాణం చేస్తున్న పవన్ దేనికీ న్యాయం చెయ్యలేకపోతున్నారా? అనే సందేహం కూడా వస్తోంది. ఎందుకంటే తెలంగాణ ఎన్నికల ఫలితాలు వచ్చిన తర్వాత పరశీలిస్తే.. తెలంగాణలో జనసేన ప్రభావం పట్ల పార్టీకి పూర్తి క్లారిటీ వచ్చేసింది. చివరి నిమిషంలో బిజెపితో పొత్తు పెట్టుకోవడం వల్ల ఎక్కువ నష్టం జరిగిందనే విషయాన్ని జనసేన గ్రహించింది. తెలంగాణలో జనసేన పోటీ చేసిన 8 చోట్ల అభ్యర్థులు డిపాజిట్లు కోల్పోవడంతో షాక్ అయింది జనసేన. తెలంగాణలో జరిగినట్టుగానే అధికార పార్టీని గద్దె దించాలంటే టీటీపీతో కలిసి గట్టి ప్రణాళికలు వెయ్యాల్సి ఉంటుందని పవన్‌కళ్యాణ్‌కి స్పష్టమైంది.
ఇదిలా ఉంటే పవన్‌కళ్యాణ్ హీరోగా నటిస్తున్న సినిమాల తాలూకు నిర్మాతలు తమ హీరో సెట్స్‌కి ఎప్పుడు వస్తాడా అని ఎదురుచూస్తున్నారు. ఓజి, ఉస్తాద్ భగత్‌సింగ్, హరిహర వీరమల్లు చిత్రాల్లో ఏదీ షూటింగ్ పూర్తయ్యే దశలో లేదు. ప్రస్తుత రాజకీయ పరిణామాల నేపథ్యంలో ఇప్పట్లో పవన్‌కళ్యాణ్ షూటింగ్‌లకు హాజరయ్యే అవకాశం లేదు అనే చెప్పాలి. చంద్రబాబునాయుడు కూడా జైలు నుంచి వచ్చేశారు. కాబట్టి ఇకపై చేయబోయే కార్యక్రమాలపై దృష్టి పెట్టాల్సి ఉంటుంది. రెండు పార్టీలు కలిసి పోటీ చేస్తున్నారంటే దానికి సంబంధించిన అనేక చర్చలు, ప్లానింగులు ఉంటాయి. మరో నాలుగు నెలల్లో ఆంధ్రప్రదేశ్‌లో ఎన్నికలు రాబోతున్నాయి. కాబట్టి ఇప్పట్లో పవన్‌కళ్యాణ్ తన సినిమాల షూటింగ్‌లో పాల్గొనే అవకాశం లేదు. వచ్చే ఏడాది సమ్మర్‌కైనా పవన్‌కళ్యాణ్ సినిమా రిలీజ్ అవుతుందని ఎదురుచూస్తున్న పవన్ కళ్యాణ్ అభిమానులకు నిరాశ తప్పదు.