English | Telugu

మోక్షజ్ఞ డెబ్యూ బాధ్యత త్రివిక్రమ్ కి అప్పగించిన బాలయ్య!

నటసింహం నందమూరి బాలకృష్ణ కుమారుడు మోక్షజ్ఞ సినీ రంగ ప్రవేశం కోసం నందమూరి అభిమానులు ఎంతగానో ఎదురుచూస్తున్నారు. అయితే త్వరలోనే వారికి గుడ్ న్యూస్ అందే అవకాశముంది. మోక్షజ్ఞ ఎంట్రీ కోసం బాలకృష్ణ తెరవెనుక అన్ని ఏర్పాట్లు చేస్తున్నారట. మోక్షజ్ఞ డెబ్యూ మూవీ బాధ్యతను ప్రముఖ దర్శకుడు త్రివిక్రమ్ కి బాలయ్య అప్పగించినట్లు సమాచారం.

త్రివిక్రమ్ ప్రస్తుతం మహేష్ బాబుతో గుంటూరు కారం చేస్తున్నాడు. ఈ సినిమా 2024 సంక్రాంతికి విడుదల కానుంది. ఆ తర్వాత అల్లు అర్జున్ తో ఓ సినిమా చేయాల్సి ఉంది. అది భారీ చిత్రమని, ప్రీ ప్రొడక్షన్ కే ఏడాదికి పైగా సమయం పడుతుందని తెలుస్తోంది. ఇలాంటి సమయంలో మోక్షజ్ఞ డెబ్యూ మూవీ బాధ్యతను త్రివిక్రమ్ తీసుకున్నారనే వార్త ఆసక్తికరంగా మారింది. అయితే ఈ సినిమాకి త్రివిక్రమ్ దర్శకుడు కాదట. ఆయన శిష్యుడు ఈ సినిమాతో దర్శకుడిగా పరిచయం కాబోతుండగా, త్రివిక్రమ్ దర్శకత్వ పర్యవేక్షణ చేయనున్నారట. అంతేకాదు ఆయన ఈ చిత్రానికి నిర్మాణ భాగస్వామిగా కూడా వ్యవహరించనున్నారని సమాచారం. సితార ఎంటెర్టైన్మెంట్స్ ఈ క్రేజీ ప్రాజెక్ట్ కి నిర్మించే అవకాశముందని, త్వరలోనే ప్రకటన రానుందని అంటున్నారు.