English | Telugu
ఎన్టీఆర్ 'దేవర'లో మరో స్టార్ హీరో!
Updated : Oct 16, 2023
'జనతా గ్యారేజ్' వంటి బ్లాక్ బస్టర్ తర్వాత జూనియర్ ఎన్టీఆర్, కొరటాల శివ కాంబినేషన్ లో రూపొందుతోన్న సినిమా 'దేవర'. యువసుధ ఆర్ట్స్, ఎన్టీఆర్ ఆర్ట్స్ సంయుక్తంగా నిర్మిస్తున్న ఈ మూవీ రెండు భాగాలుగా రానుంది. మొదటి భాగం 2024 ఏప్రిల్ 5న విడుదల కానుంది. ఇందులో బాలీవుడ్ యంగ్ బ్యూటీ జాన్వీ కపూర్ హీరోయిన్ గా నటిస్తుండగా, బాలీవుడ్ యాక్టర్ సైఫ్ అలీ ఖాన్ విలన్ గా నటిస్తున్నాడు. అలాగే వివిధ భాషలకు పలువురు ప్రముఖ నటీనటులు ఈ సినిమాలో ముఖ్య పాత్రలు పోషిస్తున్నారు. అంతేకాదు ఓ స్టార్ హీరో సైతం ఈ మూవీలో స్పెషల్ రోల్ చేస్తున్నట్లు తెలుస్తోంది.
దర్శకుడు కొరటాల శివ దేవర మూవీలోని ప్రతి పాత్రని ఎంతో పవర్ ఫుల్ గా రాసుకున్నాడట. అందుకే ఆయా పాత్రల కోసం ప్రముఖ యాక్టర్స్ ని రంగంలోకి దింపుతున్నారు. ఈ సినిమాలో ఒక కీలక పాత్ర ఉంటుందట. ఆ పాత్ర ఉండేది కాసేపే అయినప్పటికీ.. చాలా పవర్ ఫుల్ గా, సినిమాని మలుపు తిప్పేలా ఉంటుందట. అందుకే ఈ స్పెషల్ రోల్ కోసం బాలీవుడ్ స్టార్ ని రంగంలోకి దింపుతున్నారట. ఇది పాన్ ఇండియా మూవీ కావడంతో నార్త్ లోనూ ఈ సినిమాపై భారీ అంచనాలు పెరిగేలా ఇలా బాలీవుడ్ స్టార్స్ ని రంగంలోకి దింపుతున్నట్లు సమాచారం.