English | Telugu

అతనితో సినిమా చేస్తే బన్ని రిస్క్‌లో పడతాడా?

‘పుష్ప’ వరకు అల్లు అర్జున్‌ రేంజ్‌ వేరు.. పుష్ప తర్వాత వేరు. ఈ సినిమాతో పాన్‌ ఇండియాలో తనకంటూ ఒక స్పెషల్‌ ఇమేజ్‌ను ఏర్పరుచుకున్నాడు. ఇప్పుడు ‘పుష్ప2’ని పూర్తి చేస్తున్నాడు. వచ్చే ఏడాది ఈ సినిమాను రిలీజ్‌ చేసేందుకు ప్లాన్‌ చేస్తున్నారు. పుష్ప సిరీస్‌ తర్వాత బన్ని చేసే సినిమాలు ఏమిటి అనే ఆసక్తి అందరిలోనూ ఉంది. ‘పుష్ప2’ తర్వాత త్రివిక్రమ్‌తో చేసే సినిమా ఆల్రెడీ ఫిక్స్‌ అయిపోయింది. దాని తర్వాత ఏ సినిమా చేస్తాడనే విషయంలో క్లారిటీ లేదు. ఒక పక్క సందీప్‌ రెడ్డి వంగా సినిమా, మరో పక్క బోయపాటి శ్రీను సినిమా అంటూ వార్తలు వస్తున్నాయి. అయితే ఇందులో ఏది ముందు స్టార్ట్‌ అవుతుంది అనే కన్‌ఫ్యూజన్‌ ఉంది. ఇప్పుడు పరిస్థితులు చూస్తుంటే అలాంటి కన్‌ఫ్యూజన్‌ ఏదీ ఉండకపోవచ్చని అర్థమవుతోంది. 

బోయపాటి శ్రీను కాంబినేషన్‌లో ‘సరైనోడు’ వంటి సూపర్‌హిట్‌ సినిమా చేసిన బన్ని మళ్ళీ అతని కాంబోలో సినిమా చేస్తాదా లేదా అనే విషయం తేలాల్సి ఉంది. ఎందుకంటే బోయపాటి సినిమాలన్నీ ఒకే మార్క్‌తో ఉంటున్నాయని, బాలకృష్ణతో తప్ప మరో హీరోతో హిట్‌ కొట్టే అవకాశం లేదని చెప్పుకుంటున్నారు. అయితే బోయపాటి సరైనోడు వంటి హిట్‌ చేసినప్పటికీ ఇప్పుడు అది సాధ్యమయ్యే విషయం కాదని అర్థమవుతోంది. ఇటీవల రామ్‌తో ‘స్కంధ’ వంటి డిజాస్టర్‌ తీసిన తర్వాత బోయపాటితో సినిమా చేసేందుకు బన్ని ఆసక్తి చూపిస్తాడా అనేది డౌట్‌. ఎందుకంటే అది రిస్క్‌తో కూడుకున్న పని బన్ని భావిస్తున్నాడని టాక్‌. సినిమా చేసేందుకు బోయపాటి రెడీగానే ఉన్నప్పటికీ బన్నీ సైడ్‌ నుంచి ఎలాంటి రెస్పాన్స్‌ రాలేదని సమాచారం. ‘పుష్ప 2’ తర్వాత అల్లు అర్జున్‌ రేంజ్‌ ఎలాగూ పెరుగుతుంది. అలాంటప్పుడు రొటీన్‌ కథలపైనే దృష్టి పెట్టే బోయపాటికి బన్ని ఛాన్స్‌ ఇచ్చే అవకాశం ఉందా?  అంటే లేదు అనే మాటే సినీవర్గాల నుంచి వినిపిస్తోంది.