English | Telugu

‘భూలోక వీరుడు’ అంటే అశ్వనీదత్‌కి ఎందుకంత భయం?

మెగాస్టార్‌ చిరంజీవి, శ్రీవశిష్ట్‌ కాంబినేషన్‌లో ఒక ఫాంటసీ మూవీ తెరకెక్కనుందన్న విషయం తెలిసిందే. దీనికి సంబంధించి ఇంతకుముందే అధికార ప్రకటన వచ్చింది. ఈ సినిమాకి ‘భూలోకవీరుడు’ అనే టైటిల్‌ పరిశీలనలో ఉందని ప్రచారం జరుగుతోంది. కానీ, ఈ టైటిల్‌కి సంబంధించి అఫీషియల్‌ ఎనౌన్స్‌మెంట్‌ రాలేదు. ఈ సినిమాలో చిరంజీవి సరసన నలుగురు హీరోయిన్లు ఉంటారని, అందులో అనుష్క ఒకరని తెలుస్తోంది. గతంలో చిరంజీవి, శ్రీదేవి జంటగా కె.రాఘవేంద్రరావు దర్శకత్వంలో సి.అశ్వనీదత్‌ నిర్మించిన ‘జగదేక వీరుడు అతిలోక సుందరి’ తరహాలోనే ‘భూలోకవీరుడు’ కూడా ఉండబోతోందని వార్తలు వచ్చాయి. అంతేకాదు, ఆ సినిమాకి ‘భూలోకవీరుడు’ సీక్వెల్‌ అనే మాట కూడా వినిపించింది. 

జగదేకవీరుడు అతిలోక సుందరికి సంబంధించి సోషల్‌ మీడియాలో వైరల్‌ అవుతున్న న్యూస్‌కి నిర్మాత అశ్వనీదత్‌ స్పందించారు.  ఈ మేరకు వైజయంతీ మూవీస్‌ సంస్థ ఒక పబ్లిక్‌ ప్రకటన ఇచ్చింది. అశ్వినీదత్‌ నిర్మాతగా చిరంజీవి జంటగా రూపొందిన ‘జగదేక వీరుడు అతిలోక సుందరి’ సినిమా గురించి ఆ ప్రకటన. ఈ సినిమా నుండి ఒక్క సన్నివేశం, పాత్ర, ఏదైనా పేరు, సంగీతం, సీక్వెల్‌, ప్రీక్వెల్‌, అసలు ఆ సినిమా నుండి ఎటువంటి చిన్న బిట్‌ తీసుకున్నా వారిపై చట్టపరమైన చర్యలు తీసుకుంటామని ఆ సంస్థ హెచ్చరించింది. సోషల్‌ మీడియాలో వస్తున్న వార్తలకు భయపడే అశ్వినీదత్‌ ఈ ప్రకటన ఇచ్చాడని అందరూ చెప్పుకుంటున్నారు. 

ఇదిలా ఉంటే పాత సినిమాకి, ఈ సినిమాకి అస్సలు సంబంధం లేదని యూనిట్‌ సభ్యులే చెబుతున్నారు. ‘ఇది ఫాంటసీ చిత్రమే. కానీ, కథ పూర్తిగా డిఫరెంట్‌. సాధారణంగా 14 లోకాలు ఉంటాయని చెబుతుంటారు. కానీ, ఈ సినిమా మాత్రం 15వ లోకానికి చెందిన కథగా ఉంటుంది’ అన్నారు.