English | Telugu

శ్రీలీల ‘నో’ చెప్పిందా? ఇలా కూడా జరుగుతుందా?

ఒక భారీ సినిమా ఓకే అయి సెట్స్‌కి వెళ్ళాలంటే ఎన్నో అవాంతరాలు ఉంటాయి. వాటిలో హీరో, హీరోయిన్‌ సెలెక్షన్‌ ఒకటి. మొదట అనుకున్న ఆర్టిస్టులు సినిమా స్టార్ట్‌ అయ్యేవరకు ఉంటారన్న నమ్మకం లేదు. ఏదో ఒక కారణంతో పక్కకు తప్పుకోవచ్చు. వారి స్థానంలో మరొకరు రావచ్చు. ఇది ఇండస్ట్రీలో సర్వసాధారణం. 
లేటెస్ట్‌గా శ్రీలీల విషయంలో అది జరిగిందనే వార్తలు వస్తున్నాయి. సాధారణంగా శ్రీలీల ఏ పెద్ద బేనర్‌ సినిమా చెయ్యమని అడిగినా ‘నో’ చెప్పదు. అసలు ఆ సందర్భం ఇప్పటివరకు రాలేదు. ఒకేసారి రెండు, మూడు సినిమాలు చేస్తుంది. అవసరమైతే షిఫ్ట్‌ వైజ్‌ ఆయా సినిమాల షూటింగ్‌లో పాల్గొంటుంది. అలాంటిది ఒక భారీ బేనర్‌ చేసే సినిమాలో అవకాశం వస్తే వారికి ‘నో’ చెప్పిందనే వార్త అందర్నీ ఆశ్చర్యపరుస్తోంది. ఒక పెద్ద బేనర్‌, యంగ్‌ హీరో, టాలెంటెడ్‌ డైరెక్టర్‌...ఇలా అన్నీ శ్రీలీలకు నచ్చే అంశాలే. కానీ, ఎందుకు ఆ సినిమా చేయడం లేదో ఎవ్వరికీ అర్థం కావడం లేదు. అయితే ఆ సినిమాలో ఆ హీరో పక్కన రష్మిక నటిస్తుందని అందరూ అనుకున్నారు. ఆమెకు డేట్స్‌ ఎడ్జస్ట్‌ చెయ్యడంలో సమస్య రావడంతో సినిమా నుంచి తప్పుకుంది. శ్రీలీల తప్పకుండా ఓకే చేస్తుందనుకున్న యూనిట్‌కి ఆమె కూడా ‘నో’ చెప్పి షాక్‌ ఇచ్చింది. డేట్స్‌ అడ్జస్ట్‌ అవ్వకపోవడం వల్లే తను ఈ ప్రాజెక్ట్‌ నుంచి తప్పుకుందని ప్రచారం జరుగుతోంది. కానీ, శ్రీలీల విషయంలో ఆ సమస్య వుండనే వుండదని, ఏదో విధంగా సినిమా ఫినిష్‌ చేసేందకు ట్రై చేస్తుందని, నో చెప్పడానికి వేరే రీజన్‌ ఉండి వుంటుందని అందరూ భావిస్తున్నారు.