English | Telugu
బాస్ తో మిస్ శెట్టి.. ఈ సారి మాత్రం స్పెషల్ కాదట.. !
Updated : Sep 9, 2023
జయాపజయాలతో సంబంధం లేని ఇమేజ్.. మెగాస్టార్ చిరంజీవి సొంతం. రిఎంట్రీ ఇచ్చాక వరుస సినిమాలతో ముందుకు సాగుతున్న చిరు.. ఇటీవల రెండు చిత్రాలకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చారు. అందులో ఒకటి కళ్యాణ్ కృష్ణ కాంబినేషన్ మూవీ (మెగా 156) కాగా.. మరొకటి 'బింబిసార' ఫేమ్ వశిష్ట డైరెక్టోరియల్ (మెగా 157).
ఇదిలా ఉంటే, నవంబర్ నుంచి సెట్స్ పైకి వెళ్ళనున్న చిరు, వశిష్ట మూవీ.. వినూత్న కథాంశంతో తెరకెక్కనుంది. సోషియో ఫాంటసీ సబ్జెక్ట్ తో రూపొందనున్న ఈ సినిమాలో ఓ నాయికగా 'సీతారామం' బ్యూటీ మృణాళ్ ఠాకూర్ నటించబోతున్నట్లు రీసెంట్ గా వార్తలు వచ్చాయి. కాగా, ఇదే సినిమాలో లేడీ సూపర్ స్టార్ అనుష్క కూడా కనిపించబోతోందట. 'స్టాలిన్' (2006)లో చిరుతో స్పెషల్ సాంగ్ చేసిన స్వీటీ.. ఆపై 'సైరా' (2019)లో స్పెషల్ రోల్ చేసింది. అయితే, ఈ సారి మాత్రం 'స్పెషల్' కాకుండా.. ఫుల్ లెన్త్ రోల్ లో ఎంటర్టైన్ చేయనుందట. మరి.. చిరు, అనుష్క కాంబో ఏ స్థాయిలో వినోదం పంచుతుందో చూడాలి. త్వరలోనే మెగా 157లో అనుష్క ఎంట్రీపై క్లారిటీ వచ్చే అవకాశముంది.