English | Telugu

విడాకుల బాటలో ‘తొలిప్రేమ’ దర్శకుడు?.. మరీ 6 నెలలకేనా?!

ఒక సినిమా ఓకే అవ్వడానికి, దాన్ని నిర్మించడానికి, రిలీజ్‌ చెయ్యడానికి... ఇలా చిత్ర పరిశ్రమలో వివిద దశల్లో కొన్ని కారణాల వల్ల జాప్యం అనేది ఎక్కువగా జరుగుతూ ఉంటుంది. కానీ, సినిమా వారి పెళ్ళి, విడాకులు అనే రెండు విషయాలు మాత్రం చాలా ఫాస్ట్‌గా జరుగుతుంటాయి. పెళ్ళి చేసుకోవడానికి నో లేట్‌, అలాగే విడాకులు తీసుకోవడానికి నో లేట్‌. రెండూ చాలా ఫాస్ట్‌గా జరిగిపోతాయి. అయితే ఈ రెండు ఘటనలకు అంత సీరియస్‌గా తీసుకోదగ్గ కారణాలు వుండవు. పెళ్ళి చేసుకోవడం, విడాకులు తీసుకోవడం అనేది సినిమా ఇండస్ట్రీలో సర్వసాధారణమైపోయింది. అయితే ఇలా విడిపోవడానికి వారి వ్యక్తిగత కారణాలు వారికి ఉండవచ్చు. ఈమధ్యకాలంలోనే మనం చాలా జంటలు విడిపోవడం చూశాం. 

తాజాగా మరో జంట విడిపోవడానికి సిద్ధపడినట్టు తెలుస్తోంది.  వరుణ్‌ తేజ్‌తో ‘తొలిప్రేమ’ చిత్రాన్ని రూపొందింనిన దర్శకుడు వెంకీ అట్లూరికి ఈ ఏడాది ఫిబ్రవరిలో వివాహమైంది. అదే నెలలో తమిళ్‌ హీరో ధనుష్‌తో చేసిన ద్విభాషా చిత్రం ‘సార్‌’ విడుదలైంది. సాధారణంగా పెళ్ళయిన ఆరు నెలలు, సంవత్సరం వరకు వారిని కొత్త జంట అనే అంటారు. అలాంటిది ఒక కొత్త జంట విడిపోవడానికి నిర్ణయించుకుందంటే అందరికీ ఆశ్చర్యం కలుగుతుంది. వెంకీ అట్లూరి, అతని భార్యకు మధ్య సఖ్యత లేని కారణంగా విడిపోవాలని నిర్ణయించుకున్నారని, విడాకులకు కూడా అప్లయ్‌ చేశారన్న వార్త ఇండస్ట్రీలో గుప్పుమంది. అయితే ఇందులో నిజానిజాలు ఎంత అనేది కూడా తెలియాల్సి ఉంది. సినిమాలను ప్రేమించేవారు సినిమా వారికి మంచి జరిగినా, చెడు జరిగినా స్పందిస్తారు. ఇలాంటి వార్తలు విన్నప్పుడు అది నిజం కాకూడదని కోరుకుంటారు. ఇప్పటివరకైతే వెంకీ అట్లూరి విడాకులు తీసుకోతున్నాడన్నది అనధికారికంగా వచ్చిన వార్త మాత్రమే. అది నిజం కాకూడదని అందరూ కోరుకుంటున్నారు. దీనిపై పూర్తి క్లారిటీ రావాలంటే కొంత కాలం ఆగాల్సిందే.