English | Telugu
యువరత్న బాలకృష్ణ మూవీ స్టోరీ లీకయ్యింది
Updated : Mar 11, 2011
యువరత్న నందమూరి బాలకృష్ణ మువీ స్టోరీ లీకయ్యిందని సమాచారం. విషయమేమిటంటే శ్రీ కీర్తి కంబైన్స్ పతాకంపై, నందమూరి నట సింహం, యువ రత్న నందమూరి బాలకృష్ణ హీరోగా త్రిపాత్రాభినయం చేస్తూండగా, లక్ష్మీ రాయ్, సలోని లతో పాటు మరో ఇద్దరు హీరోయిన్లు నటిస్తూండగా, పరుచూరి మురళి దర్శకత్వంలో, యమ్ యల్ కుమార్ చౌదరి నిర్మిస్తున్న చిత్రం కథ లీకయ్యిందట. యువరత్న బాలకృష్ణ మూవీ స్టోరీ లీకయిన కథ ఏమిటనేది మిలియన్ డాలర్ క్వశ్చిన్.
విశ్వసనీయ వర్గాల ద్వారా అందిన సమాచారం ప్రకారం యువరత్న బాలకృష్ణ ఈ మూవీలో తాత తండ్రి మనవడుగా మూడు పాత్రల్లో నటిస్తున్నారు. యువరత్న బాలకృష్ణ మూవీ కథలో తాత పక్కా ఫ్యాక్షనిస్టు అయితే తండ్రి శాంతి కాముకుడు. మనవడు జర్నలిస్టు. తన తాతకీ, తండ్రికీ అనుసంధాన కర్తగా మనవడి పాత్ర ఉంటుందని తెలిసింది. ప్రస్తుతానికి ఇదని మాత్రమే యువరత్న బాలకృష్ణ మూవీ స్టోరీ లీకయ్యింది.