English | Telugu
వెంకటేష్ సినిమా అల్లు అర్జున్ తో త్రివిక్రమ్
Updated : Mar 10, 2011
వెంకటేష్ సినిమా అల్లు అర్జున్ తో త్రివిక్రమ్ శ్రీనివాస్ తీస్తున్నట్లు సమాచారం. వెంకటేష్ సినిమా అల్లు అర్జున్ తో త్రివిక్రమ్ శ్రీనివాస్ తీయటానికి కారణాలు ఆరా తీయగా కొన్ని ఆసక్తి కరమైన విషయాలు తెలిసాయి. త్రివిక్రమ్ శ్రీనివాస్ ఈ కథను ముందుగా విక్టరీ వెంకటేష్ కే చెప్పారట. కానీ తేజ దర్శకత్వంలో "సావిత్రి" అనే సినిమాలో నటించటానికి సిద్ధమయ్యారు. ముందు త్రివిక్రమ్ శ్రీనివాస్ సినిమా మొదలవుతుందని వినపడింది. ఈ రెండు సినిమాల్లో వెంకటేష్ ఏది ముందు చేస్తారా అని అంతా ఎదురుచూస్తుండగా, ఆయన బెల్లంకొండ సురేష్ తీసే "బాడీ గార్డ్" చిత్రంలో నటిస్తారని తెలియగానే త్రివిక్రమ్ శ్రీనివాస్ కి చిర్రెత్తుకొచ్చిందట.
దాంతో అదే కథని అల్లు అర్జున్ కి చెప్పారట.ఆ కథ వినగానే అల్లు అర్జున్ వెంటనే అంగీకరించారట. వెంకటేష్ సినిమా అల్లు అర్జున్ తో త్రివిక్రమ్ శ్రీనివాస్ తీయటానికి సిద్ధమయ్యారట. ఆ విధంగా వెంకటేష్ సినిమాని అల్లు అర్జున్ తో త్రివిక్రమ్ శ్రీనివాస్ తీయటానికి డి.వి.వి.దానయ్య తన సంసిద్ధతను తెలిపారు. ఈ వెంకటేష్ సినిమాని అల్లు అర్జున్ తో త్రివిక్రమ్ శ్రీనివాస్ తీసే సినిమాలో ఇలియానా హీరోయిన్ గా నటించబోతోంది. ఈ చిత్రం ఏప్రెల్ నుంచి సెట్స్ పైకి వెళ్ళనుంది.