English | Telugu
లెక్చరర్ గా శ్రియ
Updated : Feb 1, 2011
ప్రముఖ సినీ నటి శ్రియ లెక్చరర్ గా మారబోతోంది.అది కూడా ఏ సినిమాలో పాత్రో అనుకుంటే మీరు పొరబడినట్లే.ఆమె నిజంగానే లెక్చరర్ గా మారుతోంది.చెన్నై ఐ.టి.కాలేజ్ లో శ్రియ ఒక లెక్చర్ ఇవ్వబోతోంది.సినీమా పరిశ్రమ గురించీ, తన సినిమాల గురించీ, సాంస్కృతిక రంగాల మార్పిడికి సినిమాలు ఏ విధంగా ఉపయోగపడతాయనే అంశాల మీద శ్రియ లెక్చర్ ఇవ్వబోతోంది. సినీ పరిశ్రమలో బాగా చదువుకున్న వారెందరో ఉన్నారు.స్వర్గీయ జగ్గయ్య,డాక్టర్ ప్రభాకర్ రెడ్డి,త్యాగరాజు, జ్యోతిలక్ష్మి వంటి అనేకమంది ఉన్నత విద్యనభ్యసించినవారే కావటం గమనార్హం.జ్యోతిలక్ష్మీ యమ్.ఎ.ఇంగ్లీష్ చదివి సినిమాల్లోకి రాక పూర్వం ఎయిర్ హోస్టెస్ గా కూడా కొన్నాళ్ళు పనిచేశారు.వారి బాటలోనే ఈ రోజున శ్రియ ఐ.టి.విద్యార్థులకు లెక్చర్ ఇవ్వబోతోంది.