English | Telugu

పవన్ కళ్యాణ్ "గబ్బర్ సింగ్"లో మున్నీ ఛార్మి

పవన్ కళ్యాణ్ క్రియెటీవ్‍ వర్క్స్ అనే సొంత నిర్మాణ సంస్థను స్థాపించిన పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ ఆ బ్యానర్ మీద, హిందీలో సల్మాన్ ఖాన్ హీరోగా నటించగా సూపర్ హిట్టయిన "దబాంగ్" అనే చిత్రాన్ని తెలుగులో రీమేక్ చేయటానికి సన్నాహాలు చేస్తున్నారు. ఈ చిత్రానికి "గబ్బర్ సింగ్" అన్న పేరుని నిర్ణయించారు.ఈ చిత్రానికి హరీష్ శంకర్ దర్శకత్వం వహించనున్నారు. హిందీ చిత్రంలో మలైకా అరోరా నటించిన "మున్నీ బద్ నామ్ హోగయీ డార్ లింగ్ తేరే లియే" అన్న పాట బాగా పాప్యులర్ ఈ చిత్ర విజయానికి ఎంతగానో దోహదపడింది.ఇలాంటి పాటను తెలుగులో కూడా పెడుతున్నారు.ఈ పాటలో మ్లైకా అరోరానే నటిస్తుందని ముందుగా వార్తలొచ్చినా చివరికి ఈ చిత్రంలో ఈ పాటలో నటించటానికి ఛార్మిని ఎన్నుకున్నారని సమాచారం.