English | Telugu

మే లో రవితేజ "వీర"

శాన్వి ప్రొడక్షన్స్ పతాకంపై,మాస్ రాజా రవితేజ హీరోగా, కాజల్ అగర్వాల్, తాప్సి హీరోయిన్లుగా, రమేష్ వర్మ దర్శకత్వంలో, గణేష్ ఇంటూరి నిర్మిస్తున్న చిత్రం"వీర". ఈ చిత్రంలో కాజల్ అగర్వాల్ కబడ్డి చిట్టిగా పక్కా మాస్ పాత్రలో నటిస్తుండగా, తాప్సి మాత్రం కంప్యూటర్ ఇంజనీర్ గా డిగ్నిఫైడ్ పాత్రలో నటిస్తూంది.అంతే కాకుండా రవితేజ చిత్రాలన్నింటిలొకీ ఈ చిత్రం అత్యధిక బడ్జెట్ తో నిర్మించబడుతుందని నిర్మాత గణేష్ ఇంటూరి మీడియాకు తెలిపారు.ఇక హీరో రవితేజ పాత్రలో రెండు షేడ్లు ఉంటాయనీ, ఒకటి రాజసం తొణికిసలాడే షేడ్ అయితే రెండవది ఎంటర్ టైనర్ గా సాగే షేడ్ అనీ ఆయన అన్నారు.ఈ చిత్రాన్ని రానున్న వేసవి శలవుల కానుకగా మే నెలలో విడుదల చేయనున్నారు. లెక్చరర్ గా శ్రియ