English | Telugu
LCU విషయంలో షాక్ ఇచ్చిన లోకేష్!
Updated : Nov 15, 2023
సౌత్ డైరెక్టర్స్‌లో లోకేష్ కనకరాజ్‌కి ఓ స్పెషాలిటీ ఉంది. చేసింది తక్కువ సినిమాలే అయినా డైరెక్టర్‌గా మంచి పేరు తెచ్చుకున్నాడు. ఫ్యూచర్‌లో అతను చేయబోయే సినిమాలకు సంబంధించి ఇప్పటి నుంచే బజ్ క్రియేట్ అవుతోంది. ఖైదీ, విక్రమ్ సినిమాల్లో అతను క్రియేట్ చేసిన క్యారెక్టర్స్‌ని కొనసాగిస్తూ రాబోయే రోజుల్లో మరిన్ని సినిమాలను రూపొందించనున్నాడు. ఆ సినిమాల కోసం అతని ఫ్యాన్స్ ఎంతో ఇంట్రెస్ట్‌గా ఎదురుచూస్తున్నారు. ప్రస్తుతం తలైవా రజినీకాంత్‌తో సినిమా చేస్తున్న విషయం తెలిసిందే. ఈ సినిమా స్క్రిప్ట్ కోసం ఆరునెలల టైమ్ తీసుకొని పర్‌ఫెక్ట్‌గా రెడీ చేసుకున్నాడు.
ఇదిలా ఉంటే అతను క్రియేట్ చేసిన ఎల్‌సియుకి సంబంధించి ఒక గాసిప్ వైరల్ అవుతోంది. అదేమిటంటే ఎల్‌సియు వరల్డ్‌లోకి అతని అసిస్టెంట్ డైరెక్టర్స్‌ను తీసుకురావాలని ఆలోచిస్తున్నాడు. ఖైదీ 2, విక్రమ్2 వంటి ప్రాజెక్ట్‌లను లోకేష్ అసిస్టెంట్స్ డైరెక్ట్ చేసే అవకాశం ఉందని తెలుస్తోంది. వారికి మొదట తన కథలతోనే అవకాశాలు ఇవ్వాలని ఆలోచిస్తున్నట్లుగా తెలుస్తోంది. ఇప్పటికే కథలను డెవలప్ చేయడంలో అందరూ కూడా బిజీ అయినట్లు సమాచారం. లోకేష్ కనకరాజు రోలెక్స్ పాత్రకు సంబంధించిన సినిమా మాత్రమే డైరెక్టర్ చేసే అవకాశం ఉందట. వినిపిస్తున్న ఈ వార్త ఎంతవరకు నిజం అనేది అతని నోటి వెంటే వినాలి. ఇక టాలీవుడ్‌లో ప్రభాస్, రామ్‌చరణ్ వంటి హీరోలతో కూడా సినిమాలు చెయ్యాలనే ఆలోచనలో లోకేష్ ఉన్నట్టు తెలుస్తోంది.