English | Telugu
మొదటి భాగం కంటే.. 681 శాతం ఎక్కువ బడ్జెట్‌తో రెండో భాగం!
Updated : Nov 20, 2023
ప్రస్తుతం రెగ్యులర్ సినిమాలకు భిన్నమైన కథలతో సినిమాలు చేస్తేనే ప్రేక్షకులు ఆదరిస్తున్నారు. ఇప్పుడదే ట్రెండ్‌గా మారిపోయింది. అందుకే దర్శకులు కూడా 30 సంవత్సరాల క్రితం కథ అంటూ స్టార్ట్ చేస్తున్నారు. కథ ఏ సంవత్సరంలోనిది అని చెప్పినా అందులో విషయం ఉంటే తప్పకుండా హిట్ అవుతుంది. ఇటీవల చిన్న సినిమాగా వచ్చి పెద్ద విజయం సాధించిన ‘కాంతార’ విషయంలో కూడా అదే జరిగింది. కన్నడలో నిర్మాణం జరుపుకున్న ఈ సినిమా ఎలాంటి అంచనాలు లేకుండా విడుదలైంది. కన్నడలో విడుదలై విజయం సాధించిన తర్వాతే తెలుగులో రిలీజ్ అయింది. ఈ సినిమా దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించింది. ఈ సినిమా కాన్సెప్ట్, దాన్ని రిషబ్ శెట్టి అద్భుతంగా ఎగ్జిక్యూట్ చేసిన విధానం వల్ల సినిమా ఘనవిజయం సాధించింది.
అనూహ్య విజయం సాధించిన ఈ సినిమాకి ప్రీక్వెల్ ఉంటుందని దర్శకుడు, హీరో రిషబ్‌శెట్టి ప్రకటించారు. కాంతార ప్రీక్వెల్ డిసెంబర్‌లో స్టార్ట్ అవుతుందని తెలుస్తోంది. ప్రజల భూమిని రక్షించే స్థానిక దేవత.. కథానాయకుడి ఆత్మతో ఎలా మమేకం అయ్యింది? అనేది పార్ట్ 1లో చూపించారు. ఈ ప్రీక్వెల్ క్రీ.శ. 301-400 మధ్య జరిగిన కథగా ఉంటుంది. కాంతారలో చూపించిన పంజుర్లీ దైవం మూలాలకు సంబంధించిన కథతో ప్రీక్వెల్ తెరకెక్కనుంది. కాంతార 1కి పనిచేసిన ప్రధాన టెక్నీషియన్స్ ప్రీక్వెల్‌కి కూడా ఉంటారు. కాంతార కంటే 681 శాతం ఎక్కువ బడ్జెట్‌తో ఈ ప్రీక్వెల్ నిర్మిస్తారట. కాంతారావు 2 చిత్రీకరణను 2024లోనే పూర్తి చేసి, వచ్చే ఏడాది చివరిలో విడుదల చేసే అవకాశం ఉందని సమాచారం.