English | Telugu

సందీప్ రెడ్డి వంగా దర్శకత్వంలో ఎన్టీఆర్!

ప్రస్తుతం సందీప్ రెడ్డి వంగా పేరు మారుమోగిపోతోంది. ఆయన డైరెక్ట్ చేసిన యాక్షన్ థ్రిల్లర్ 'యానిమల్' డిసెంబర్ 1న ప్రేక్షకుల ముందుకు రానుంది. ఇప్పటికే విడుదలైన ట్రైలర్ విశేషంగా ఆకట్టుకొని సినిమాపై అంచనాలను పెంచేసింది. ఈ మూవీతో సందీప్ పాన్ ఇండియా వైడ్ గా సౌండ్ చేయడం ఖాయమనే అంచనాలున్నాయి. దీని తర్వాత సందీప్ చేయబోయే సినిమాలపై కూడా ప్రేక్షకుల దృష్టి ఉంది.

సందీప్ తన తదుపరి సినిమాగా ప్రభాస్ తో 'స్పిరిట్' చేయనున్నాడు. దీనిని వచ్చే ఏడాది సెప్టెంబర్ లో సెట్స్ పైకి తీసుకెళ్లడానికి సన్నాహాలు చేస్తున్నారు. ఆ తర్వాత అల్లు అర్జున్ తో ఓ సినిమా చేయనున్నాడు. ఈ రెండు సినిమాల తర్వాత మహేష్ బాబు, రామ్ చరణ్ వంటి వారితో సినిమాలు చేసే అవకాశముందని వార్తలు రాగా, తాజాగా జూనియర్ ఎన్టీఆర్ పేరు తెరపైకి వచ్చింది. ఎన్టీఆర్-సందీప్ రెడ్డి కాంబినేషన్ ని సెట్ చేయడానికి ఒక ప్రముఖ నిర్మాణ సంస్థ ప్రయత్నిస్తోందట. ఈ ఇద్దరి కాంబోలో ఒక యాక్షన్ ఫిల్మ్ పడితే రికార్డుల మోత మోగిపోవడం ఖాయమని ఆ ప్రొడక్షన్ హౌస్ భావిస్తోందట.

ప్రస్తుతం ఎన్టీఆర్ 'దేవర' సినిమాతో బిజీగా ఉన్నాడు. ఇది వచ్చే ఏడాది ఏప్రిల్ 5న ప్రేక్షకుల ముందుకు రానుంది. అలాగే 'వార్-2', ప్రశాంత్ నీల్ ప్రాజెక్ట్, 'దేవర-2' లైన్ లో ఉన్నాయి. వీటి తర్వాత సందీప్ రెడ్డి ప్రాజెక్ట్ సాధ్యమవుతుందేమో చూడాలి.