English | Telugu

తల్లి కాబోతున్న సమంత.. పెళ్లి చేసుకునే ఉద్దేశం మాత్రం లేదట!

హీరోయిన్‌ సమంత కెరీర్‌, జీవితం.. అన్నీ భిన్నమైనవి. ఏ విషయాన్నయినా డిఫరెంట్‌గా ఆలోచించే సమంత తనకు నచ్చినట్టు జీవించాలని కోరుకుంటుంది. సమాజం కోసం బ్రతకడం అనేది తన కాన్సెప్ట్‌లోనే లేదని ఖచ్చితంగా చెబుతుంది. ఎలాంటి సినిమా బ్యాక్‌గ్రౌండ్‌ లేకుండా కేవలం తన టాలెంట్‌తోనే టాప్‌ హీరోయిన్‌ రేంజ్‌కి వెళ్లిన సమంత తన 14 ఏళ్ళ సినిమా కెరీర్‌లో ఎన్నో ఒడిదుడుకులు చూసింది. కెరీర్‌ పరంగా ఎన్నో సూపర్‌హిట్స్‌, పర్సనల్‌ లైఫ్‌లో బాధలు... ఇలా రెండేళ్ళుగా ఇబ్బందులు పడుతోంది. నాగచైతన్యతో పెళ్లి, ఆ తర్వాత విభేదాల కారణంగా విడాకులు ఆమెను మరింత కృంగదీశాయి. ఈ క్రమంలోనే ఆమెపై ఎన్నో నిందలు, ఆరోపణలు చేశారు. సోషల్‌ మీడియా ఆమెను ట్రోల్‌ చేసింది. దాంతో మానసికంగా ఒత్తిడికి గురైంది. సమంతను కావాలనే ఒక వర్గం టార్గెట్‌ చేస్తోందనే వాదన వినిపిస్తోంది. ఇప్పుడు వీటన్నింటికీ తోడు మయోటైటిస్‌ అనే అరుదైన వ్యాధి ఆమెను బాధిస్తోంది. ఏడాదికాలంగా ఈ వ్యాధికి చికిత్స తీసుకుంటోంది. సినిమాలకు కూడా బ్రేక్‌ ఇచ్చి ప్రస్తుతం రెస్ట్‌ తీసుకుంటోంది. 

సమంతకు ఇప్పుడు 36 సంవత్సరాలు. విడాకుల తర్వాత ఒంటరిగానే ఉంటున్న సమంతను పెళ్లి చేసుకోమని ఆమె తల్లిదండ్రులు కోరుతున్నారు. కానీ, ఈ విషయంలో ఇప్పటివరకు ఎలాంటి నిర్ణయం తీసుకోలేదు. ఇప్పుడు జీవితంలో కొత్తగా సాధించేది ఏమీలేదు, అన్నీ చూశావు. నీకంటూ ఓ కుటుంబాన్ని ఏర్పరుచుకోమని ఆమె సన్నిహితులు సలహా ఇస్తున్నారు. అయితే అయితే సమంతకు జీవితంలో పెళ్లి చేసుకునే ఆలోచన లేదట. ఇకపై ఒంటరిగా ఉండిపోవాలి అనుకుంటోందట. మిగిలిన జీవితం నటనకు, సోషల్‌ వర్క్‌కి ఉపయోగించాలని భావిస్తోందని తెలుస్తోంది. మరో విషయం ఏమిటంటే సమంతకు తల్లి కావాలన్న కోరిక బలంగా ఉందట. అందుకే ఇద్దరు పిల్లలను దత్తత తీసుకోవాలన్న ఆలోచనలో ఉందని తెలుస్తోంది. ఈ విషయం ఇప్పుడు సోషల్‌ మీడియాలో చక్కర్లు కొడుతోంది. అయితే దీనికి సంబంధించి ఎలాంటి అధికారిక ప్రకటన రాలేదు. అయినా సమంత తల్లి కావాలనుకుంటోందనే వార్త మాత్రం ప్రముఖంగా వినిపిస్తోంది. 2014 నుండి ప్రత్యూష సపోర్ట్‌ పేరుతో ఓ ఛారిటీ సంస్థ నడుపుతుంది సమంత. ఈ సంస్థ తరపున మహిళలు, ఆడపిల్లల సంక్షేమానికి కృషి చేస్తుంది. కాబట్టి సమంత పిల్లలను దత్తత తీసుకుని అమ్మ అవ్వాలన్న కోరిక తీర్చుకోవాలని సమంత భావిస్తోందని ప్రచారం జరుగుతోంది.