English | Telugu
ఉమ్మా కావాలా..? రేటు పెరుగుద్ది..!
Updated : Feb 8, 2014
తెలుగులో టాప్ 5 హీరోయిన్స్ లలో ఒకరిగా పేరు తెచ్చుకున్న సమంత త్వరలోనే తమిళ హీరో విజయ్ పెదాలకు గట్టిగా ఉమ్మా.... ఇవ్వనుంది. మురుగదాస్ దర్శకత్వంలో విజయ్ హీరోగా తెరకెక్కనున్న ఓ చిత్రంలో ఓ భారీ లిప్ లాక్ సన్నివేశం ఉందట. అయితే ఇందులో ముందుగా హీరోయిన్ గా కాజల్ ను ఎంపిక చేసుకొని పారితోషకం కూడా ఇచ్చేసారట సదరు చిత్ర నిర్మాతలు. కానీ కథలో భాగంగా గ్లామర్ బాగా ఎక్కువగా చూపించాలి, అదే విధంగా ఒక భారీ లిప్ లాక్ కూడా ఉందని చెప్పడంతో కాజల్ నో చెప్పేసి.. పారితోషకాన్ని వెనక్కి ఇవ్వడానికి సిద్ధమయ్యిందట. కాజల్ నో చెప్పడంతో ఈ అవకాశాన్ని సమంత దక్కించుకుంది. కాకపోతే పారితోషకం కాస్త ఎక్కువగా కావాలని డిమాండ్ చేసిందట. దానికి సదరు నిర్మాతలు కూడా వెంటనే ఓకే చెప్పేసారట. మరి త్వరలోనే తెరకెక్కనున్న ఈ చిత్రంలో సమంత ఎంత గ్లామర్ ను ఒలకబోస్తుందో చూడాలి.
అయితే ఈ అమ్మడి ఉమ్మా గ్రీన్ సిగ్నల్ గురించి సమంత డార్లింగ్ సిద్ధార్థ్ ఎలా స్పందించనున్నాడో త్వరలోనే తెలియనుంది. ఇదిలా ఉంటే... ఈ అమ్మడు ఒలకబోయడానికి ఆమె దగ్గర ఏం గ్లామర్ ఏముంది అంటూ అందరు నవ్వుకుంటున్నారు. ఈ అమ్మడిని నమ్ముకుని నిర్మాత డబ్బులు చేస్తున్నట్టే అంటూ అనుకుంటున్నారు. మరి ఈ విషయాలపై చిత్ర దర్శక నిర్మాతలు ఏమైనా మార్పులు చేస్తారో లేక అందరూ నవ్వుకున్నట్లే ఈ అమ్మడిలో లేని గ్లామర్ తోనే సినిమా తీస్తారో అనే విషయం త్వరలోనే తెలియనుంది.