English | Telugu
పూరి సినిమా ఎవరితో...?
Updated : Feb 1, 2014
పూరి సినిమాలో కంటెంట్ కొత్తగా ఉన్నపటికీ గత వరుస ఫ్లాపులతో సతమతమవుతున్నాడు. అల్లు అర్జున్ తో "ఇద్దరమ్మాయిలతో" వంటి స్టైలిష్ చిత్రం తెరకెక్కించినప్పటికి కూడా సినిమా విజయం సాధించలేకపోయింది. ఈ సినిమాతో ఇక పూరి వరస ఫ్లాప్స్ దర్శకుడిగా పేరు పడిపోయింది. పూరి సినిమా అంటే ఇక కమర్షియల్ గా సక్సెస్ అవ్వడం కూడా కష్టమే అని అందరూ అనుకున్నారు. కానీ పూరి తాజా చిత్రం "హార్ట్ ఎటాక్" ఇటీవలే విడుదలై మంచి టాక్ ను సొంతం చేసుకుంది. లవ్, యాక్షన్, రొమాంటిక్ ఎంటర్ టైనర్ గా తెరకెక్కిన ఈ చిత్రానికి మంచి స్పందన వస్తుంది. దీంతో ఈసారి ఎలాగైనా పూరితో సినిమా చేయాలని హీరోలు, నిర్మాతలు అనుకుంటున్నారట. కానీ ప్రస్తుతం పూరి మాత్రం హార్ట్ ఎటాక్ ఇచ్చిన సక్సెస్ ను ఎంజాయ్ చేస్తున్నాడు. మరి పూరి తర్వాత చిత్రం ఎవరితో అనేది త్వరలోనే తెలియనుంది.