English | Telugu

నెట్ ఫ్లిక్స్ లో 'సలార్'.. ప్రభాస్ అంటే అంతే బాస్!

బాహుబలి సిరీస్ తరువాత పాన్ ఇండియా స్టార్ అయిపోయారు ప్రభాస్. అయితే, ఆ తరువాత వచ్చిన సాహో, రాధేశ్యామ్, ఆది పురుష్ నిరాశపరిచాయి. ఈ నేపథ్యంలో.. కేజీఎఫ్ డైరెక్టర్ ప్రశాంత్ నీల్ తెరకెక్కిస్తున్న సలార్ పైనే అందరి ఆశలు ఉన్నాయి. రెండు భాగాలుగా ఈ సినిమా రాబోతోంది. మొదటి భాగమైన సలార్ పార్ట్ 1: సీజ్ ఫైర్ సెప్టెంబర్ 28న రిలీజ్ కావాల్సింది. కొన్ని కారణాల వల్ల అది వాయిదా పడింది. త్వరలోనే కొత్త రిలీజ్ డేట్ పై క్లారిటీ రానుంది.

ఇదిలా ఉంటే, సలార్ కి సంబంధించిన ఓటీటీ రైట్స్ ని దిగ్గజ ఓటీటీ సంస్థ నెట్ ఫ్లిక్స్ సొంతం చేసుకుందని సమాచారం. అంతేకాదు.. చాలా భారీ మొత్తంతో ఈ స్ట్రీమింగ్ రైట్స్ ని కైవసం చేసుకుందని టాక్. సహజంగా ప్రభాస్ సినిమాలు డిజిటిల్ ప్లాట్ ఫామ్స్ లో భారీ మొత్తానికే అమ్ముడవుతున్నాయి. సలార్ కి అంతకుమించి బిజినెస్ జరిగిందని బజ్. త్వరలోనే సలార్ ఓటీటీ రైట్స్ కి సంబంధించి స్పష్టత రానుంది. 

కాగా, సలార్ లో ప్రభాస్ కి జోడీగా శ్రుతి హాసన్ నటిస్తోంది. జగపతిబాబు, పృథ్వీరాజ్ సుకుమారన్ ఇతర ముఖ్య పాత్రల్లో దర్శనమివ్వనున్నారు.