English | Telugu

నాని, అనిరుధ్.. ముచ్చటగా మూడోసారి

తమిళనాట నంబర్ వన్ మ్యూజిక్ డైరెక్టర్ గా హవా చాటుతున్నాడు యంగ్ సెన్సేషన్ అనిరుధ్ రవిచందర్. ఇటీవల జైలర్, జవాన్ వంటి సంచలన చిత్రాలతో మరోసారి వార్తల్లో నిలిచిన అనిరుధ్.. త్వరలో విజయ్ లియోతో సందడి చేయనున్నాడు. అక్టోబర్ 19న ఈ సినిమా తెరపైకి రాబోతోంది. ఇక తెలుగు విషయానికి వస్తే.. యంగ్ టైగర్ ఎన్టీఆర్ దేవరతో పాటు విజయ్ దేవరకొండ, గౌతమ్ తిన్ననూరి కాంబో మూవీకి కూడా అనిరుధ్ ట్యూన్స్ ఇవ్వనున్నాడు.

ఇదిలా ఉంటే, అనిరుధ్ తాజాగా మరో తెలుగు మూవీకి గ్రీన్ సిగ్నల్ ఇచ్చాడట. ఆ వివరాల్లోకి వెళితే.. నేచురల్ స్టార్ నాని కథానాయకుడిగా డాన్ (శివకార్తికేయన్) చిత్ర దర్శకుడు శిబి చక్రవర్తి ఓ మూవీ చేయబోతున్నట్లు వార్తలు వస్తున్న సంగతి తెలిసిందే. శ్రీనివాస చిట్టూరి నిర్మించనున్న ఈ క్రేజీ మూవీ.. దసరాకి ప్రారంభం కానుందని సమచారం. కాగా, ఈ చిత్రానికి అనిరుధ్ బాణీలు కడతాడని టాక్. అదే గనుక నిజమైతే.. నాని, అనిరుధ్ కాంబోలో ఇది మూడో చిత్రం కానుంది. గతంలో వీరిద్దరి కలయికలో జెర్సీ, గ్యాంగ్ లీడర్ సినిమాలొచ్చాయి. వీటిలో జెర్సీ విజయం సాధించింది.