English | Telugu

'సలార్' తీన్ మార్.. ఏదో ఒకటి త్వరగా డిసైడ్ చేయండి.. !

యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ అభిమానులంతా ఎంతో ఆసక్తిగా ఎదురు చూస్తున్న సినిమా 'సలార్'. రెండు భాగాలుగా రాబోతున్న ఈ పిరియడ్ డ్రామాని.. 'కేజీఎఫ్' కెప్టెన్ ప్రశాంత్ నీల్ తెరకెక్కిస్తున్నారు. వాస్తవానికి సలార్ మొదటి భాగం సెప్టెంబర్ 28న రావాల్సింది. అయితే, కొన్ని కారణాల వల్ల వాయిదా వేశారు. తాజాగా మేకర్స్ కూడా ఈ విషయాన్ని ధ్రువీకరించారు. అలాగే, కొత్త రిలీజ్ డేట్ ని త్వరలోనే ప్రకటిస్తామని కూడా చెప్పుకొచ్చారు. 

లేటెస్ట్ బజ్ ఏంటంటే.. 'సలార్' మేకర్స్ ప్రస్తుతం మూడు తేదీలపై కన్నేశారట. కుదిరితే నవంబర్ 24న ఈ సినిమాని తీసుకురావాలని చూస్తున్నారట. లేని పక్షంలో క్రిస్మస్ స్పెషల్ గా డిసెంబర్ 22కి ప్లాన్ చేస్తున్నారట. ఒక వేళ ఆ తేదికి షారుక్ ఖాన్ 'డుంకీ' సినిమా వస్తే గనుక.. సంక్రాంతి స్పెషల్ గా జనవరి 11న లాక్ చేసే అవకాశముందట. ప్రస్తుతం.. సోషల్ మీడియాలో ఎక్కడ చూసినా 'సలార్'కు సంబంధించిన ఈ తీన్ మార్ తేదీల వ్యవహారమే కనిపిస్తోంది. దీంతో.. అభిమానులు "త్వరగా ఏదో ఒక తేదీని డిసైడ్ చేయండి" అంటూ కామెంట్స్ చేస్తున్నారు. మరి.. ఫైనల్ గా ఏ రోజున 'సలార్' తెరపైకి వస్తుందో చూడాలి.