English | Telugu

నెవర్ సీన్ బిఫోర్ రోల్ లో తారక్.. నాని దర్శకుడి భారీ స్కెచ్!

టెంపర్ నుంచి యంగ్ టైగర్ ఎన్టీఆర్ కథల ఎంపిక మారింది. టెంపర్, నాన్నకు ప్రేమతో, జనతా గ్యారేజ్, జై లవ కుశ, అరవింద సమేత, ఆర్ ఆర్ ఆర్.. ఇలా ఒకదానితో ఒకటి పొంతన లేని కథలు ఎంచుకుంటూ వరుస విజయాలతో ముందుకు సాగుతున్నాడు తారక్. తాజా చిత్రం దేవర కూడా ఈ కోవకు చెందినదేనని సమాచారం.

ఇదిలా ఉంటే, తాజాగా ఎన్టీఆర్ ఓ పిరియడ్ యాక్షన్ డ్రామాకి గ్రీన్ సిగ్నల్ ఇచ్చాడని సమాచారం. ఆ వివరాల్లోకి వెళితే.. విజయ్ దేవరకొండతో టాక్సీవాలా, నానితో శ్యామ్ సింగ రాయ్ చిత్రాలను తెరకెక్కించిన రాహుల్ సాంకృత్యన్ తాజాగా ఎన్టీఆర్ కోసం ఓ ఆసక్తికరమైన కథను సిద్ధం చేసుకున్నాడట. స్టోరీ నచ్చడంతో పాటు తాను ఇంతవరకు చేయని పాత్ర కావడంతో.. తారక్ కూడా రాహుల్ కథకు పచ్చజెండా ఊపారని టాక్. అంతేకాదు.. ఈ చిత్రాన్ని ప్రముఖ నిర్మాణ సంస్థ మైత్రీ మూవీ మేకర్స్ నిర్మించే అవకాశముందని బజ్. త్వరలోనే తారక్, రాహుల్ సాంకృత్యన్ కాంబో మూవీపై క్లారిటీ వచ్చే అవకాశముంది.