English | Telugu
టాప్ స్టార్ కొడుకుతో సాయిపల్లవి రొమాన్స్.. బాలీవుడ్ లో ఇప్పుడిదే హాట్ టాపిక్..!
Updated : Sep 13, 2023
సాయిపల్లవి మంచి నటీమణే కాదు.. మంచి డ్యాన్సర్ కూడా. అందుకే.. తెలుగు, మలయాళం, తమిళ భాషల్లో తనకంటూ ప్రత్యేక అభిమాన గణాన్ని సంపాదించుకుంది. పారితోషికం కంటే పాత్రకే ప్రాధాన్యమిచ్చే సాయిపల్లవి.. సినిమాల ఎంపికలో ఆచితూచి అడుగేలేస్తుంటుంది. అందుకే విరాట పర్వం తరువాత మరో తెలుగు సినిమాకి సంతకం చేయలేదు పల్లవి. ఇక, తమిళంలో మాత్రం శివకార్తికేయన్ తో ఓ సినిమా చేస్తోంది ఈ టాలెంటెడ్ యాక్ట్రస్.
ఇదిలా ఉంటే, ఇప్పటివరకు హిందీ సినిమాలు చేయని సాయిపల్లవి.. తాజాగా ఓ క్రేజీ ప్రాజెక్ట్ కి గ్రీన్ సిగ్నల్ ఇచ్చిందని బజ్. ఆ వివరాల్లోకి వెళితే.. మిస్టర్ పర్ఫెక్షనిస్ట్ ఆమిర్ ఖాన్ తనయుడు జునైద్ ఖాన్ త్వరలో వెండితెరపై సందడి చేయనున్నాడు. యశ్ రాజ్ ఫిల్మ్స్ సంస్థ నిర్మిస్తున్న ఈ చిత్రం ప్రస్తుతం నిర్మాణ దశలో ఉంది. ఇది రిలీజయ్యేలోపే.. సందీప్ పాండే దర్శకత్వంలో జునైద్ హీరోగా ఓ సినిమా పట్టాలెక్కనుంది. లవ్ స్టోరీగా తెరకెక్కనున్న ఈ మూవీలో జునైద్ కి జోడీగా సాయిపల్లవి నటించబోతోందని బాలీవుడ్ వర్గాలు చెప్పుకుంటున్నాయి. త్వరలోనే సాయిపల్లవి బాలీవుడ్ ఎంట్రీ మూవీపై క్లారిటీ రానుంది.