English | Telugu

నయన్ 'లెక్కల'కి అర్థాలే వేరులే..! 

'జవాన్' సక్సెస్ తో లేడీ సూపర్ స్టార్ నయనతార స్థాయి మరింత పెరిగింది. నిన్న మొన్నటి వరకు దక్షిణాదికే పరిమితమైన నయన్ క్రేజ్.. ఇప్పుడు బాలీవుడ్ కి కూడా చేరుకుంది. ఈ నేపథ్యంలో.. అక్కడి నుంచి కూడా నయనతారకి కొన్ని అవకాశాలు క్యూ కడుతున్నాయి.

ఇదిలా ఉంటే, దక్షిణాదిన అత్యధిక రెమ్యూనరేషన్ తీసుకుంటున్న నాయికగా పేరు తెచ్చుకున్న నయన్.. తాజాగా వచ్చే సినీ ఆఫర్లకు కొత్త లెక్కలు చెబుతోందట. కేవలం దక్షిణాది వరకు పరిమితమయ్యే సినిమాలకు రూ. 5 కోట్లు, పాన్ ఇండియా రేంజ్ మూవీలకు రూ. 10 కోట్ల వరకు రెమ్యూనరేషన్ డిమాండ్ చేస్తోందని సమాచారం. మరి.. ఈ కథనాల్లో వాస్తవమెంతో తెలియాల్సి ఉంది. 

కాగా, ప్రస్తుతం నయన్ చేతిలో మూడు తమిళ చిత్రాలున్నాయి. వాటిలో ఇరైవన్ సెప్టెంబర్ 28న విడుదలకు సిద్ధమైంది. జయం రవి హీరోగా నటించిన ఈ సినిమాకి ఐ. అహ్మద్ దర్శకత్వం వహించగా.. యువన్ శంకర్ రాజా సంగీతమందించాడు.