English | Telugu
ఛత్రపతి శివాజీగా రాకీ భాయ్.. బాక్సాఫీస్ కి పూనకాలే!
Updated : Sep 13, 2023
కేజీఎఫ్ సిరీస్ తో జాతీయ స్థాయిలో గుర్తింపు పొందాడు శాండిల్ వుడ్ స్టార్ యశ్. రెండు భాగాలుగా తెరకెక్కిన ఆ సినిమా పుణ్యమా అని.. పాన్ ఇండియా స్టార్ ట్యాగ్ సొంతం చేసుకున్నాడు రాకీ భాయ్. అయితే, కేజీఎఫ్ పార్ట్ 2 విడుదలై ఒకటిన్నర సంవత్సరం అవుతున్నా కొత్త ప్రాజెక్ట్ గురించి కబురు వినిపించలేదు యశ్. లేటెస్ట్ బజ్ ఏంటంటే.. లేడీ డైరెక్టర్ గీతూ మోహన్ దాస్ కాంబినేషన్ లో యశ్ తదుపరి సినిమా ఉండబోతోందట. డిసెంబర్ నుంచి ఈ క్రేజీ ప్రాజెక్ట్ సెట్స్ పైకి వెళుతుందట.
ఇదిలా ఉంటే, త్వరలో యశ్ ఓ చారిత్రాత్మక పాత్రలో కనిపించబోతున్నాడట. అది కూడా.. ఛత్రపతి శివాజీ వేషంలో. ఓ ప్రముఖ దర్శకుడు ఈ హిస్టారికల్ మూవీని ప్లాన్ చేస్తున్నారని.. బహుశా వచ్చే ఏడాది ఈ భారీ బడ్జెట్ వెంచర్ ప్రారంభమయ్యే అవకాశముందని చెప్పుకుంటున్నారు. అదే గనుక నిజమైతే.. బాక్సాఫీస్ కి పూనకాలు తెచ్చే ప్రాజెక్ట్ గా ఈ సినిమా నిలుస్తుందనడంలో ఎలాంటి అతిశయోక్తి లేదు. త్వరలోనే ఈ సినిమాకి సంబంధించి క్లారిటీ వస్తుంది.