English | Telugu

డైరెక్టర్ గా మారుతున్న స్టార్ రైటర్.. హీరో ఎవరు?

రచయితలు దర్శకులుగా మారడం సహజం. ఇప్పటికే ఎందరో రైటర్స్ మెగా ఫోన్ పట్టారు. అందులో సక్సెస్ ఫుల్ డైరెక్టర్ గా పేరు తెచ్చుకున్నవాళ్ళు కూడా చాలామందే ఉన్నారు. ఇప్పుడు మరో రచయిత దర్శకుడిగా మారబోతున్నట్లు తెలుస్తోంది. ఆయన ఎవరో కాదు ప్రముఖ రైటర్ సాయిమాధవ్ బుర్రా.

'కృష్ణం వందే జగద్గురుమ్'తో డైలాగ్ రైటర్ గా టాలీవుడ్ కి పరిచయమైన సాయిమాధవ్.. 'గోపాల గోపాల', 'కంచె', 'గౌతమి పుత్ర శాతకర్ణి', 'మహానటి', 'సైరా నరసింహారెడ్డి', 'ఆర్ఆర్ఆర్' వంటి సినిమాలతో స్టార్ రైటర్ గా ఎదిగారు. ప్రస్తుతం ఆయన చేతిలో 'కల్కి 2898 AD', 'హరిహర వీరమల్లు' వంటి భారీ సినిమాలు ఉన్నాయి. ఇప్పుడు ఆయన మనసు దర్శకత్వం వైపు మళ్ళినట్టు తెలుస్తోంది. ఇప్పటికే కథను సిద్ధం చేసుకొని ఓ హీరోకి వినిపించగా, అతని నుంచి సానుకూల స్పందన వచ్చినట్లు సమాచారం. త్వరలో ఈ ప్రాజెక్ట్ పట్టాలెక్కే అవకాశముంది అంటున్నారు. హీరో ఎవరు? బ్యానర్ ఏంటి? వంటి విషయాలపై మరికొద్ది రోజుల్లో క్లారిటీ వచ్చే అవకాశముంది.