English | Telugu
పవన్ కళ్యాణ్ ఫ్యాన్స్ కి బిగ్ షాక్!
Updated : Nov 9, 2023
టాలీవుడ్ కి చెందిన స్టార్ హీరోలందరూ పాన్ ఇండియా జపం చేస్తున్నారు. ఇప్పటికే పలు స్టార్లు పాన్ ఇండియా ఇమేజ్ సొంతం చేసుకున్నారు. అయితే తెలుగునాట ఎంతో క్రేజ్ ఉన్న పవన్ కళ్యాణ్ ఇప్పటిదాకా పాన్ ఇండియాపై పెద్దగా దృష్టి పెట్టలేదు. సినిమాలతో పాటు రాజకీయాల్లోనూ ఫుల్ బిజీగా ఉన్న ఆయన, తక్కువ రోజుల్లో పూర్తయ్యే సినిమాలు చేయడానికి ఎక్కువగా ఆసక్తి చూపిస్తున్నాడు. అయితే పవన్ కి పాన్ ఇండియా ఇమేజ్ తెచ్చిపెట్టే సినిమా 'ఓజీ' అవుతుందని ఫ్యాన్స్ బలంగా నమ్ముతున్నారు. కానీ ఇప్పుడు 'ఓజీ'కి ఊహించని షాక్ తగిలిందని తెలుస్తోంది.
పవన్ కళ్యాణ్ హీరోగా సుజీత్ దర్శకత్వంలో డీవీవీ దానయ్య నిర్మిస్తున్న గ్యాంగ్ స్టర్ ఫిల్మ్ 'ఓజీ'. ఇప్పటికే విడుదలైన పోస్టర్లు, గ్లింప్స్ విశేషంగా ఆకట్టుకొని అంచనాలను ఆకాశాన్నంటేలా చేశాయి. ప్రస్తుతం పవన్ చేతిలో పలు సినిమాలు ఉన్నప్పటికీ.. ఫ్యాన్స్ ఈ సినిమా కోసమే ఎక్కువగా ఎదురుచూస్తున్నారు. ఈ చిత్రం కేవలం తెలుగు రాష్ట్రాల్లోనే కాకుండా, ఇండియా వైడ్ గా వసూళ్ల వర్షం కురిపిస్తుందని ఫ్యాన్స్ బలంగా నమ్ముతున్నారు. అయితే ఇప్పుడు ఈ సినిమా హిందీ డీల్ క్యాన్సిల్ అయిందనే న్యూస్ వినిపిస్తోంది. తమ హీరోకి పాన్ ఇండియా ఇమేజ్ తీసుకొస్తుందని నమ్ముతున్న సినిమా హిందీ డీల్ క్యాన్సిల్ అయిందనే వార్త నిజమైతే.. ఇది నిజంగా పవన్ ఫ్యాన్స్ కి బిగ్ షాక్ అనే చెప్పాలి.