English | Telugu

త్రిషకు జయంత్ వార్నింగ్...?

ఒక హీరోయిన్ కు ఒక దర్శకుడు వార్నింగ్ ఇవ్వటమనేది కాస్త ఇబ్బందికరమైన పరిస్థితే.కానీ అదే జరిగిందట.విషయానికొస్తే పరమేశ్వర ఆర్ట్స్ పతాకంపై, పవన్ కళ్యాణ్‍ హీరోగా, జయంత్ దర్శకత్వంలో, గణేష్ నిర్మిస్తున్న "లవ్ లీ" చిత్రంలో త్రిష హీరోయిన్ గా నటిస్తూంది.ఈ చిత్రంలోని కోన్ని స్టిల్స్ తీసుకుని తన ట్విట్టర్ లో పోస్ట్ చేద్దామనుకుందట త్రిష.ఈ విషయం తెలుసుకున్న దర్శకుడు జయంత్.సి.పరాన్జీ వెంటనే ఈ సినిమాలోని ఏ చిన్న విషయం కూడా తనకు తెలియకుండా బయటకు పొక్కటానికి వీల్లేదని త్రిషకు స్ట్రిక్ట్ గా చెప్పారట.ఆఖరికి ఏ ఒక్క ఫొటో కూడా బయటకు రాకూడదని.ఈ సినిమాకి తాను పబ్లిసిటీని చాలా డిఫరెంట్ గా ప్లాన్ చేశారట.త్రిష వల్ల ఆ ప్లాన్ పాడవుతుందని ఆయన కంగారు పడ్డారట.