English | Telugu
రవితేజకి హీరోయిన్ కరవు.. ఖండించిన హరీష్!
Updated : Dec 16, 2023
మాస్, యాక్షన్, కామెడీ మిక్స్ అయిన అనేక సినిమాలతో అప్పట్లో ట్రెండ్ క్రియేట్ చేసిన రవితేజ ఆ తర్వాత ఆశించిన విజయాలు సాధించలేకపోయాడు. అయినప్పటికీ అవకాశాలు మాత్రం ఎక్కడా తగ్గడం లేదు. ఏదో ఒక సినిమాతో ప్రేక్షకుల ముందుకు వస్తూనే ఉన్నాడు. ఇటీవల గోపీచంద్ మలినేని దర్శకత్వంలో మైత్రి మూవీ మేకర్స్ ఒక సినిమాను ప్రారంభించిన విషయం తెలిసిందే. అయితే కొన్ని కారణాల వల్ల ఆ సినిమాకు బ్రేక్ పడిరది. దీంతో వెంటనే హరీష్ శంకర్‌తో సినిమా చేస్తున్నట్టు ప్రకటించాడు. ఈ సినిమా ఎనౌన్స్ చేసిన తర్వాత వారికి హీరోయిన్ పెద్ద సమస్యగా మారిందని, రవితేజ సరసన సీనియర్ హీరోయిన్‌ను ఎంపిక చేసే ఆలోచనలో నిర్మాతలు ఉన్నారని, కొందరు రవితేజ సినిమాలో నటించేందుకు నిరాకరించారని, ఇప్పుడు కొత్త హీరోయిన్ కోసం అన్వేషిస్తున్నారని.. ఇలా రకరకాలుగా ప్రచారం జరుగుతోంది. జరుగుతున్న ప్రచారంలో నిజం లేదని డైరెక్టర్ హరీష్ శంకర్ స్పష్టం చేశాడు.
ఫైనల్‌గా రవితేజ సినిమాలో హీరోయిన్ ఓకే అయిపోయిందని సమాచారం. బాలీవుడ్‌లో యారియా2లో నటించిన భాగ్యశ్రీ బోర్సేను రవితేజ సినిమా కోసం ఫిక్స్ చేసారని తెలుస్తోంది. ఇటీవల ఆమెకు టెస్ట్ లుక్ చేసినట్లు తెలిసింది. సినిమాలోని క్యారెక్టర్‌కు భాగ్యశ్రీ హండ్రెడ్ పర్సెంట్ సూట్ అవుతుందని భావించిన మేకర్స్ ఆమెనే ఓకే చేసినట్టు తెలుస్తోంది. మోడల్‌గా కెరీర్ ప్రారంభించిన భాగ్యశ్రీ నటిగా కంటే సోషల్ మీడియాలోనే ఫాలోయింగ్ ఎక్కువ అని ఇన్‌స్టాలో ఆమె ఫాలోవర్స్‌ను చూస్తే అర్థమవుతుంది. రవితేజ సరసన భాగ్యశ్రీ నటించనుందన్న విషయం చిత్ర యూనిట్ అధికారికంగా ప్రకటించాల్సి ఉంది.